పెళ్లి కోసమే యువకుడిని కిడ్నాప్ చేసిన యువతి
నిర్దేశం, హైదరాబాద్ :
హైదరాబాద్‌లో ఓ యువతి కిడ్నాప్ ప్లాన్ బెడిసికొట్టింది. ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న యువకుడిని త్రిష అనే యువతి కిడ్నాప్ చేసిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపుతోంది. యాంకర్‌ని పెళ్లి చేసుకోవాలనుకున్న త్రిష కిడ్నాప్ చేయించి, బంధించింది.
పెళ్లి చేసుకోవాలని ఆరాటపడి చివరికి పోలీసులకు చిక్కింది. త్రిష అనే యువతి డిజిటల్ మార్కెటింగ్ వ్యాపారం చేస్తోందని తేలింది. భారత్ మ్యాట్రిమోనీలో ప్రణవ్ ఫోటోలను చూసి ప్రేమలో పడిన త్రిష.. పెళ్లి చేసుకుంటే అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.
డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ నిర్వహిస్తున్న త్రిష అనే యువతి యాంకర్ ప్రణవ్‌ను కిడ్నాప్ చేసింది. అయితే ఇదంతా పెళ్లి కోసమేనని పోలీసుల విచారణలో వెల్లడైంది. కళ్ళుగప్పి కిడ్నాప్ చెర నుంచి తప్పించుకున్న ప్రణవ్ పోలీసులను ఆశ్రయించడంతో అసలు డ్రామా బయటపడింది. మ్యాట్రిమోని సైట్‌లో ప్రణవ్ ఫోటో చూసి మనసు పారేసుకుంది. దీంతో అతన్ని కిడ్నాప్ చేసి రూమ్‌లో బంధించింది త్రిష. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చిందని పోలీసులు తెలిపారు. వాస్తవానికి యాంకర్ ప్రణవ్ మ్యాట్రిమోని సైట్‌లో ప్రొఫైల్‌లో ఎలాంటి ఫోటోలు పెట్టుకోలేదు. ప్రణవ్ పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి డబ్బులు సంపాదించాలని కొంతమంది కేటుగాళ్లు స్కెచ్ వేశారు.
అయితే ఈ క్రమంలోనే ప్రణవ్ ప్రొఫైల్ నిజమని నమ్మిన త్రిష.. అతనిపై మనసు పారేసుకుంది. మ్యాట్రిమోని సైట్‌లో నిజంగానే ప్రణవ్ ఐడీ అనుకుని ఇష్టపడ్డ త్రిష అతన్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది. అతని కాంటాక్ట్స్ అధారంగా సంప్రదించింది. ఇందుకు ప్రణవ్ ఆమె ప్రపోజల్‌కు నిరాకరించాడు. ఈ క్రమంలోనే అతన్ని కిడ్నాప్ చేసి రూమ్‌లో బంధించింది.
పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెంచింది. ఎలాగోలా ఆమె బారినుంచి బయటపడ్డ ప్రణవ్.. నేరుగా పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కిడ్నాప్ కథ వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరపడంతో అసలు యవ్వారం బయటపడింది.ప్రస్తుతం పలు స్టార్టప్ కంపెనీలను త్రిష నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ప్రణవ్ దెబ్బకు కిడ్నాప్ కేసులో ఇరుక్కుని జైలుపాలయింది.