నక్సల్స్ ఉన్న రోజులే వేరు..

ఔను.. నిజం నక్సలైట్లు ఆ రోజులే వేరు

నాకు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి

కాలేజీకి వెళ్ళిన అమ్మాయిలను వేధించిన పోకిరీలను
గుండం గీసి దండించిన రోజులు..

చిన్నారిపై అత్యాచారం చేసిన మానవ మృగాన్ని
నడి బజారులో కాళ్ళు చేతులు విరిచేసిన రోజులు..

ఔను నాకు గుర్తుకు వస్తున్నాయి

కట్నం కోసం నిప్పంటించి
కట్టు కథ అల్లిన
అత్తింటి వారి భరతం పట్టిన రోజులు..

అప్పు డబ్బుల కోసం కోరిక తీర్చమన్న
వ్యాపారి వీపు సున్నం చేసిన రోజులు

ఔను నాకు గుర్తుకు వస్తున్నాయి

భూస్వాములను, రౌడీలను,

పోకీరిలకు దేహశుద్ది చేసిన రోజులు..

అందుకే మళ్లీ ఆ నక్సల్స్ మల్లీ రావాలని

కోరుకుంటున్నారు కొందరు..

( ఆడ బిడ్డలు ఎందరు రాలిపోవాలి)

కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ జర్నలిస్ట్

అక్షర ఆవేదన ఇది..

ప్రియుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య

వరంగల్‌:ఆత్మహత్య.. క్షణిక ఆవేశంతో జీవితానికి ముగింపు పలుకుతుంది యువత. ప్రతి సమస్యకు పరిష్కార మార్గం ఉంటుంది. కానీ.. సోషల్ మీడియా డామినెట్ చేస్తున్న నేటి కాలంలో యువత సమస్యకు భయపడి మరో కోణంలో ఆలోచన చేయడం లేదు.

ఉమ్మడి వరంగల్‌లో దారుణం వెలుగుచూసింది. మెడికల్‌ విద్యార్థి ప్రీతి, బీటెక్‌ స్టూడెంట్‌ రక్షిత సుసైడ్‌ ఘటనలు మరవక ముందే మరో యువతి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. ప్రేమికుడు మోసం చేశాడన్న కారణంతో ఉరివేసుకొని ప్రాణాలు వదిలింది.

ఎల్కతుర్తి మండలం గోపాలపూర్‌కు చెందిన పోగుల ఉషారాణి అనే యువతి.. డిగ్రీ పూర్తి చేసి ల్యాబ్ టెక్నీషియన్ ఒకేషనల్ కోర్సు చేస్తోంది. ఈ క్రమంలో భూపాలపల్లికి చెందిన ప్రశాంత్‌ కిషోర్‌తో పరిచయం ఏర్పడింది. ఈ స్నేహం ప్రేమగా మారింది. అయితే ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన సోమవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

——

ఈ ఆత్మహత్యలపై స్పందించిన

లహరి మహేందర్ గౌడ్

——

సమస్యాకు చావు పరిష్కారమా..???

జీవితం అంటే
పుట్టుక నుంచి చావు వరకూ
చేసే ప్రయాణం..

ఆ ప్రయాణంలో ఎన్నో సమస్యలు..

ఎదురు దెబ్బలు కూడా..

అన్నిటిని అధిగమిస్తెనే

అసలైన జీవితం..

సమస్యలకు భయపడి

ఆత్మహత్య చేసుకుంటే

నీ సమస్య పరిష్కారం కాదు

పైగా మరిన్ని సమస్యలు

తల్లిదండ్రులకు కడుపు కోత

నీ బంగారు భవిష్యత్ నాశనం

ఇవన్నీ ఆలోచన చేసి

ఆత్మహత్య చేసుకోవాలనే

ఆలోచనకు పుల్ స్టాప్ పెడుదాం..

 

 

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!