పోక్సో కేసులో ఒక వ్యక్తికి జీవితఖైదు
రంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జిపై చెప్పు విసిరిన ముద్దాయి
హైదరాబాద్, నిర్ధేశం:
తనను దోషిగా ప్రకటించడాన్ని జీర్ణించుకోలేక చెప్పు విసిరిన వైనం
నేరస్తుడిని చితకబాదిన న్యాయవాదులు, రంగారెడ్డి జిల్లా కోర్టులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. జీవిత ఖైదు పడిన ఓ నేరస్తుడు కోపం తట్టుకోలేక జడ్జి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. పోక్సో కోర్టు న్యాయమూర్తిపై చెప్పు విసిరాడు. పోక్సో కేసులో తనను జడ్జి దోషిగా ప్రకటించడంతో జీర్ణించుకోలేకపోయాడు. జడ్జిపై చెప్పు విసిరాడు. జరిగిన ఘటనతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు. కోర్టులో ఉన్న న్యాయవాదులు నేరస్తుడిని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.