స్వాతంత్య్ర సమరయోధుడు
కుటుంబానికి వివిధ వర్గాల మద్దతు
సంగారెడ్డి మార్చ్ 3 : స్వాతంత్య్ర సమరయోధుడు కుటుంబానికి అండగా ఉంటాం అని పలు రాజకీయ పార్టీల, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంఘాల సంపూర్ణ మద్దతు ప్రతతించాయి. స్వాతంత్య్ర సమరయోధుడు కోవూరి మొగలయ్య గౌడ్ ‘మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి సంగారెడ్డి జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంపూర్ణ మద్దతు పలికారు.
ఈ సందర్భంలో స్వాతంత్య్ర సమరయోధుడు కోవూరి మొగలయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ఫ్రీడమ్ ఫైటర్ ఆశయాలకు సంపూర్ణ మద్దతుతో తీర్మానం చేసిన పలు రాజకీయ పార్టీలకు, సంఘాలకు, మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ట్రస్ట్ చైర్మన్ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడు ముందుంటానని, అవినీతికి పాల్పడుతున్నటువంటి దుండగులకు త్వరలో బుద్ధి చెబుతామని అగ్రహం వ్యక్తం చేశారు. మరియు భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగంలో భాగమైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులను గౌరవిస్తూ ప్రజాస్వామ్యంలో ప్రజలకు అండగా ప్రజా సమస్యలను పరిష్కరించడంలోముందుంటామని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే శాసన శాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా శాఖ వారి యొక్క విధి విధానాలను ప్రజల సంక్షేమం కోసం నెరవేరుస్తారో అప్పుడే.. అభివృద్ధి సాధ్యమవుతుందని తెలియజేశారు.
అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా సంగారెడ్డి జిల్లాలో సదాశివపేట పట్టణానికి చెందిన స్వతంత్ర సమరయోధుడు కీర్తిశేషులు : కోవూరి మొగలయ్య గౌడ్ సతీమణి కోవూరి మణెమ్మ, న్యాయపూర్తమైన పది ఎకరాల భూసమస్యపై నిర్లక్ష్యం వహిస్తున్న దుండగులకు త్వరలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ యొక్క సమావేశానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు సంపూర్ణ మద్దతు పలుకుతూ తీర్మాన పత్రాన్ని ఫ్రీడమ్ ఫైటర్ కోపూరి మొగలయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ కు అందజేశారు.