ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వైద్యుడు రాసిన లేఖ

కరోనా మహ్మరి గురించి ప్రధానికి హైదరాబాద్ వైద్యుడు లేఖ 

కొరోనా వ్యాధి, తదనంతరం వాక్సినేషన్ వలన, భారత దేశ ప్రజల్లో ఊహించని రీతిలో, వ్యాధి పూరితమైన మార్పులు, ఎలర్జీలు పెరుగుతున్నాయని తన లేఖలో వైద్యుడు పేర్కొన్నారు.

కొరోనా వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల, ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం లేదు అని చెప్పలేమని , వ్యాక్సినేషన్ తీసుకోవడం వలన మరి ఒకసారి కొరోనా వ్యాధి బారిన పడే అవకాశం లేకపోలేదని, మరి ఇటువంటి అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా వ్యాక్సినేషన్ ఎంతవరకు ఉపయోగపడుతుందో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నామని, హైదరాబాద్ వైద్యుడు తెలిపాడు.

దేశం లో కేవలం హైరిస్క్ గ్రూపు కి మాత్రమే, ఈ కరోనా వ్యాక్సిన్ పరిమితం చేసినట్లయితే కొంతవరకు బాగుండేదని, మాస్ కొరోనా వ్యాక్సినేషన్యాక్షన్ వలన ఎంత నష్టం ఎంత ఉపయోగము చెప్పలేని స్థితిలో మనం ఉన్నామని హైదరాబాద్ వైద్యుడు అభిప్రాయపడ్డాడు.

కొరోనా వ్యాక్సినేషన్ అందరూ ఖచ్చితముగా వేసుకోవాలనే గవర్నమెంట్ ఆర్డర్ లేనప్పటికీ, భారతదేశంలో ఉన్న సుమారు 33 కోట్లమంది ఎలర్జీ పేషెంట్లు తెలియకుండానే వ్యాక్సినేషన్ తీసుకున్నారని,
వాస్తవానికి అలర్జీ రోగగ్రస్తులనూ వ్యాక్సినేషన్ నుంచి మినహాయింపు ఉన్నా వారికి సమాచారం అందని పరిస్థితుల్లో ఉన్నామని డాక్టర్ తన లేఖలో గుర్తు చేశారు.

అందరికీ కచ్చితంగా వేసుకోవాలని రవాణా వ్యవస్థలో, కాలేజీలలో, ఇతరత్రా ఆఫీసులలో, కఠిన నిబంధనలు పెట్టిన మాట వాస్తవం అని, ఇది కేవలం కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల, మీడియా కమ్యూనికేషన్ సమన్వయ లోపం వలనే ప్రజలు ఇబ్బంది పడ్డారని వైద్యుడు పేర్కొన్నాడు.

హైదరాబాద్ వైద్యుడు తన లేఖలో, ప్రస్తావిస్తూ, ఇప్పటికైనా కొరోనా మాస్ వాక్సినేషన్ ను
ఆపాలని ప్రధానమంత్రిని విజ్ఞప్తి చేశారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!