ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విరమణ

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విరమణ

– ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌ల అనంత‌రం నిర్ణ‌యం
– ఉద్యోగుల సంక్షేమంలో రాజీపడబోదని స‌ర్కార్ హామీ

నిర్దేశం, హైదరాబాద్ః

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె విరమించారు. ప్రభుత్వ ప్రతినిధులతో జరిపిన చర్చలతో వారు సంతృప్తి చెందారు. సమ్మె యోచన విరమించుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఇతర ఉద్యోగులు కూడా ప్రభుత్వంపై సమరమేనని ప్రకటించడంతో వారితో చర్చలు జరిపేందుకు ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ఓ కమిటీని నిమించారు.ఆర్టీసీ ఉద్యోగులు ఏడో తేదీ నుంచి అంటే బుధవారం నుచి సమ్మెకు వెళ్లాలన అనుకున్నారు. తేదీ దగ్గర పడటంతో ప్రభుత్వం వారి డిమాండ్లకు ఏ మాత్రం సానుకూలంగా వ్యవహరించకపోగా కఠినంగా వ్యవహరించింది. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోని సమ్మెకు వెళ్తే సంస్థ మనుగడుకు ప్రమాదం ఏర్పడుతుందన్నారు.

అదే సమయంలో ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు లేఖ రాసింది. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం విషయంలో ఏ మాత్రం రాజీపడబోదని హామీ ఇచ్చింది. సమ్మె పేరుతో ఉద్యోగులను బెదిరిస్తే కఠిన చర్యలు ఉంటాయని యాజమాన్యంలేఖను విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం బహిరంగ లేఖ రాసింది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆర్థిక పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలు ఆర్టీసీ కార్మికులను ఆలోచింప చేశాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థికపరమైన డిమాండ్లు నెరవేర్చే అవకాశం లేదని క్లారిటీ రావడంతో వారు సమ్మె ప్రతిపాదన విరమించుకున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు ఇతర ఉద్యోగులు కూడా పోరు బాట పట్టాలని

డిసైడయ్యారు. దీంతో వారితో చర్చల కోసం ముగ్గురు అధికారులతో కమిటీని నియమించారు. నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణభాస్కర్ లు ఈ కమిటీలో ఉంటారు. వీరు ఉద్యోగ సంఘం నేతలతో చర్చలు జరుపుతారు. వారి డిమాండ్లు ఏమిటో తెలుసుకుని ప్రభుత్వం ముందు ఉంచుతారు. డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మెకు వెళ్తామంటున్న ఉద్యోగా సంఘాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగ సంఘాల నేతలు ఇక

సమరమే అంటున్నారని.. ఇదేదో మనోళ్లేనా, ఇంకెవరైనా అన్నారా అని అనుకున్నానని అన్నారు. హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన ఉద్యోగ సంఘాల నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై సమరం చేస్తామని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారని.. . ప్రభుత్వంలో పని చేసే ఉద్యోగులు మూడున్నర లక్షల మంది.. మీరు ప్రకటించిన సమరం 97 శాతం ప్రజల మీదనా అని ప్రశ్నించారు. జీతాలు రానప్పుడు కనీసం నోరు విప్పారా?.. ఇప్పుడు జీతాలు రావడం లేదని ఉద్యోగులు అడగకుండానే వేశాం కదా అని ప్రశ్నించారు. గతంలో బెనిఫిట్స్ ఇవ్వకుండా ఉండేందుకు రిటైర్‌మెంట్‌ ఏజ్ పెంచారు.. మీరు దాచుకున్న

సొమ్ము, బెనిఫిట్స్ రూ.9 వేల కోట్లు పెండింగ్ పెట్టారు.. ప్రజలు కష్టాల్లో ఉంటే సహకరించాల్సిన ఉద్యోగ సంఘాలు సమరం అంటున్నాయి.. మీకు జీతాలు ఇస్తున్న ప్రజలే మాకు ఉద్యోగాలు ఇచ్చారు.. సమస్య ఉంటే చర్చకు రండి, చర్చిద్దాం.. ప్రజల మీద యుద్ధం చేసిన వాళ్లు ఎవరూ బాగుపడలేదు.. ప్రజల మీద యుద్ధం చేస్తారా?.. రాజకీయ నాయకుల చేతిలో పావులుగా మారకండి, ప్రజల గుండెల్లో చురకత్తులు పొడవకండి అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »