10 నుంచి మెట్రో మోత

10 నుంచి మెట్రో మోత

హైదరాబాద్, నిర్దేశం:
మెట్రో రైలు ప్రయాణికులకు బిగ్ షాకింగ్ న్యూస్. వారంరోజుల్లో మెట్రో రైలు చార్జీలు పెరగబోతున్నాయి. ఈనెల 10వ తేదీ నుంచి పెంచిన మెట్రో చార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నియమించిన ఛార్జీల నిర్ణయ కమిటీ (ఎఫ్ఎఫ్సీ) ఇచ్చిన నివేదిక ఆధారంగా చార్జీలను పెంచనున్నారు. అయితే, ఈనెల 8వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మెట్రో అధికారులు భేటీ కానున్నారు.

ఈ భేటీలో సీఎం నుంచి అనుమతి తీసుకొని పెంచిన చార్జీలను అమల్లోకి తీసుకొచ్చేందుకు మెట్రో యాజమాన్యం సిద్ధమైంది.కరోనా సమయంలో ఏడాదిపాటు మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో మెట్రో పై ఆర్థిక భారం ప్రారంభమైంది. ప్రస్తుతం ఆ భారం రూ.6,598కోట్లకు చేరినట్లు సమాచారం. అయితే, కొంతకాలంగా మెట్రో చార్జీలను పెంచేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెట్రో యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది.

హైదరాబాద్ మెట్రోలో ప్రస్తుతం రోజుకు 1200 సర్వీసులు నడుస్తుండగా.. 4.80లక్షల మంది ప్రయాణిస్తున్నారు. శని, ఆదివారాల్లో, సెలవు రోజుల్లో 5.10లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు.
ఎఫ్ఎఫ్సీ  నివేదిక ఆధారంగా టికెట్ చార్జీలు పెంచుకునే స్వతంత్రత మెట్రో నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీకి ఉంటుందని తెలుస్తోంది. మెట్రో రైల్వే (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) యాక్ట్ 2002 ప్రకారం టికెట్ రేట్లను సవరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం చార్జీల కంటే 25 నుంచి 30శాతం పెంచేందుకు కసరత్తు జరుగుతోంది. చార్జీల పెంపుతో ప్రతీయేటా రూ.150 నుంచి 170 కోట్ల వరకు వార్షిక ఆదాయం రాబట్టుకోవాలని, తద్వారా కొంతైనా నష్టాల భారాన్ని తగ్గించుకోవచ్చునని మెట్రో యాజమాన్యం భావిస్తోందట.
త్వరలో పెరిగే టికెట్ల చార్జీలు ఇలా (అంచనా)
రెండు కిలో మీటర్ల దూరం వరకు ప్రస్తుతం ఛార్జీ రూ.10 ఉండగా.. రూ.15కు పెరిగే అవకాశం 2 నుంచి 4 కిలో మీటర్లు ప్రస్తుతం ఛార్జీ రూ.15 ఉంది. రూ. 20కి పెరిగే అవకాశం.
4 నుంచి 6 కిలోమీటర్లు ప్రస్తుతం ఛార్జీ రూ.25 ఉంది. రూ. 35 వరకు పెరిగే అవకాశం.
6 నుంచి 8 కిలో మీటర్లు ప్రస్తుతం ఛార్జీ రూ. 30 ఉంది. రూ. 40 పెరిగే అవకాశం.
8 నుంచి 10 కిలో మీటర్లకు ప్రస్తుతం ఛార్జీ రూ. 35 ఉంది. రూ. 45కు పెరిగే అవకాశం.
10 నుంచి 14 కిలో మీటర్లకు ప్రస్తుతం ఛార్జీ రూ. 40 ఉంది. రూ. 55కు పెరిగే అవకాశం.
14నుంచి 18 కిలో మీటర్లకు ప్రస్తుతం ఛార్జీ రూ. 45 ఉంది. రూ. 60కు పెరిగే అవకాశం.
18 నుంచి 22 కిలో మీటర్లకు ప్రస్తుతం ఛార్జీ రూ. 50 ఉంది. రూ. 65కు పెరిగే అవకాశం.
22 నుంచి 26 కిలో మీటర్లకు ప్రస్తుతం ఛార్జీ రూ.55 ఉంది. రూ. 70కు పెరిగే అవకాశం.
26 కిలో మీటర్లకుపైన ప్రస్తుతం ఛార్జీ రూ. 60 ఉంది. రూ. 75కు పెరిగే అవకాశం.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »