నీటి క్వారీలో పడి మరో యువకుడు మృతి
మేడ్చల్, నిర్దేశం:
జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారం అటవీ ప్రాంతంలో గల నీటి క్వారీలో పడి 18 ఏళ్ల దత్తు అనే యువకుడు మృతి చెందాడు. కాప్రా కు చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు యువకులు దత్తు, వినయ్ లు వేసవి కాలం కావడంతో ఈత కొట్టడానికి అని జవహార్ నగర్ లోని అడవి ప్రాంతంలో గల నీటి క్వారీ వద్దకు చేరారు. అందులోకి దిగి ఈత కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు నీటి క్వారీలో ఒకరు దత్తు అనే యువకుడు మునిగిపోగా, మరొకరు వినయ్ అనే యువకుడు బయటకు వెళ్లి సమాచారం అందించాడు. ఈత రాకపోవడంతో నీటిలో దత్తు గల్లంతయ్యాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈత బృందాలచే గాలింపు కొనసాగించి, మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి, దర్యాప్తు జరుపుతున్నారు.