హోటల్ లో ఘోర అగ్నిప్రమాదం..14 మంది మృతి
కోల్కత్త, నిర్దేశం:
కోల్కత్తలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి సెంట్రల్ కోల్కత్తలోని ఒక హోటల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారని పలువురు తీవ్రంగా గాయపడ్డారని నగర పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ వర్మ వెల్లడించారు.
చికిత్స కోసం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ఈ ఘటనపై సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకు వచ్చారన్నారు.
అలాగే సహాయక చర్యలు సైతం వారు చేపట్టారని వివరించారు. హోటల్‌లో చిక్కుకున్న పలువురిని వారు రక్షించారని తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదన్నారు. ఈ అగ్ని ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు. అందుకోసం ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు.