హైబ్రిడ్‌ టెర్రరిస్టులతో.. పాకిస్తాన్‌ ఘాతుకం

హైబ్రిడ్‌ టెర్రరిస్టులతో.. పాకిస్తాన్‌ ఘాతుకం

డిజిటల్ ఎవిడెన్స్ సేకరించిన ఎన్ ఐఏ

న్యూఢిల్లీ, నిర్దేశం:
పహల్గామ్‌లో పర్యాటకుల ఊచకోత వెనుక హైబ్రిడ్‌ టెర్రర్‌ హస్తం బయటపడింది. పాక్‌లో నక్కిన టెర్రరిస్టు గురువుల ఆదేశాలతో ఈ దాడికి పాల్పడినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ మధ్యే పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్ అసీం మునీర్‌.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌ నుంచి ముష్కరమూకకు ఎప్పటికప్పుడు ఆదేశాలు అందుతున్నట్టు పహల్గామ్‌ దాడి జరిగిన ప్రదేశం నుంచి NIA డిజిటెల్‌ ఎవిడెన్స్‌ను సంపాదించింది. కశ్మీర్‌ పండిట్ల ఊచకోత వెనుక కూడా హైబ్రిడ్‌ టెర్రరిస్టుల హస్తమే బయటపడింది. అందుకే దాడికి పాల్పడ్డ వాళ్లతో పాటు స్కెచ్‌ గీసిన వాళ్లను కూడా కఠినంగా శిక్షించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదన్నారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌. హైబ్రిడ్‌ టెర్రరిజాన్ని కూడా ఉక్కుపాదంతో అణచివేయాలని కేంద్రం నిర్ణయించింది.కశ్మీర్ పాక్‌కి జీవనాడి అంటూనే.. 13లక్షల సైన్యం ఉన్న భారత్‌ తమనేం చేయలేదన్నారు. ఎన్నో త్యాగాల తర్వాత పాకిస్తాన్ ఏర్పడిందని.. దాన్ని ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసన్నారు.ఉగ్ర దాడి వెనుక కీలక సూత్రధారి లష్కరే తోయిబా టాప్ కమాండర్ సైపుల్లా కసూరి అలియాస్ ఖలీద్ ఉన్నాడని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ముసాతో పాటు రావల్‌కోటకు చెందిన మరో లష్కరే ఉగ్రవాది కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. ఐదు రోజుల క్రితం ఓ సమావేశంలో.. జిహాద్‌ కొనసాగుతుంది.. తుపాకులు ఎక్కుపెట్టి ఉన్నాయని ప్రకటించాడు ముసా. అటు పాక్‌ ఆర్మీ చీఫ్‌.. ఇటు మునీర్‌ ప్రకటన చేసిన రోజుల వ్యవధిలోనే.. బైసరన్‌లో నరమేథం సృష్టించారు ఉగ్రవాదులు.పహల్గామ్‌ ఉగ్రదాడిలో పాకిస్తాన్‌ ప్రమేయం స్పష్టంగా బయటపడింది. అమాయక పౌరులను కాల్చి చంపింది పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులే.. అంతేకాదు వాళ్లకు ఆదేశాలు కూడా పాకిస్తాన్‌ నుంచే వచ్చాయి.. హైబ్రిడ్‌ టెర్రరిస్టులతో పాకిస్తాన్‌ ఈ ఘాతుకానికి పాల్పడింది. లష్కర్‌ స్లీపర్‌సెల్‌ పహల్గామ్‌లో నరమేథం సృష్టించింది. 2024లో ఆర్మీ క్యాంప్‌పై దాడి చేసిన ఉగ్రవాదుల బ్యాచే పహల్గామ్‌లో టూరిస్టులను ఊచకోత కోసింది. ఆ దాడి తరువాత సైలెంట్‌ గా ఉన్న ముష్కర మూక పహల్గామ్‌లో పంజా విసిరింది.వాళ్లకు టెర్రరిజం వృత్తి.. కానీ ముసుగులో మరో ఉద్యోగాలు చేస్తుంటారు. ఒకసారి అటాక్‌లో పాల్గొంటే మళ్లీ ఎప్పటికో దాడుల్లో పాల్గొంటారు. ఈ గ్యాప్‌లో సామాన్యుల్లా అమాయకుల్లా, రోజువారీ జీతగాళ్లలా బిల్డప్‌లు ఇస్తుంటారు. పహల్గావ్‌ ఉగ్రదాడి నిందితులు కూడా 2018లో పూంచ్‌ ఎటాక్ తర్వాత సైలెన్స్ అయ్యారు. -రెగ్యులర్ యాక్టివిటీస్ లేకపోవడంతో ట్రేసింగ్ కూడా సవాలే అని చెప్పుకోవాలి. ముసుగేసిన లష్కర్ ఇ తోయిబానే..టీఆర్ ఎఫ్‌ గా మారింది. విరుగుడుగా బలగాల ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నాయి. ఇక కశ్మీర్ లోపలంతా ఏరివేత.. బోర్డర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది.హైబ్రిడ్‌ టెర్రర్‌ బ్యాచ్‌లో సభ్యులపై నిఘా వర్గాల దగ్గర కచ్చితమైన సమాచారం లేదు. టార్గెట్‌ను ఫినిష్‌ చేసిన తరువాత ఈ బ్యాచ్‌ చాలా కాలం సైలెంట్‌గా ఉంటుంది. టీమ్‌ సభ్యులు విడిపోయి మళ్లీ కలుస్తారు.. ఉగ్రవాద కార్యకలాపాలకు దూరంగా ఉంటారు.. తరువాత పాకిస్తాన్‌ నుంచి ఆదేశాలు రాగానే మళ్లీ దాడులు మొదలుపెడుతారు.పహల్గామ్‌లో ఇదే జరిగింది. పూంచ్‌లో దాడికి పాల్పడ్డ  గ్రూపుకు పాక్‌ ‌ ఆర్మీ రిటైర్డ్‌ జవాన్‌ ఆసిఫ్‌ లీడ్‌ చేశాడు. ఈ గ్యాంగ్‌కు పాకిస్తాన్‌లో ఉన్న లష్కరే డిప్యూటీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న సైఫుల్లా నుంచి ఎప్పటికప్పుడు ఆదేశాలు వస్తున్నాయి. పహల్గామ్‌ దాడి కోసం కరాచీ, ముజఫరాబాద్‌లో వార్‌ రూమ్‌ను ఏర్పాటు చేశాడు సైఫుల్లా..పాకిస్తాన్‌ నుంచి ముష్కరమూకకు ఎప్పటికప్పుడు ఆదేశాలు అందుతున్నట్టు పహల్గామ్‌ దాడి జరిగిన ప్రదేశం నుంచి NIA డిజిటెల్‌ ఎవిడెన్స్‌ను సంపాదించింది. కశ్మీర్‌ పండిట్ల ఊచకోత వెనుక కూడా హైబ్రిడ్‌ టెర్రరిస్టుల హస్తమే బయటపడింది. అందుకే దాడికి పాల్పడ్డ వాళ్లతో పాటు స్కెచ్‌ గీసిన వాళ్లను కూడా కఠినంగా శిక్షించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదన్నారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌. హైబ్రిడ్‌ టెర్రరిజాన్ని కూడా ఉక్కుపాదంతో అణచివేయాలని కేంద్రం నిర్ణయించింది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »