ఉప ఎన్నికల బరిలో కవిత

ఉప ఎన్నికల బరిలో కవిత

కరీంనగర్, నిర్దేశం:
పార్టీ మారితే పవర్ వస్తుందనుకున్న ఎమ్మెల్యేలను అనర్హత వేటు టెన్షన్ వెంటాడుతోంది. వేటు పడితే మాత్రం ఉప ఎన్నిక జరగడం ఖాయం. అయితే ఓ నియెజకవర్గంలో బై ఎలక్షన్ వస్తే మాత్రం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రంగంలోకి దిగబోతున్నారనే చర్చ ఇప్పుడు జోరందుకుంది. పార్టీ క్యాడర్ సైతం కవిత పోటీ చేయాలని డిమాండ్ చేస్తోందట. అదే జరిగితే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల కంటే..వారిద్దరి మధ్య జరిగే బై ఎలక్షన్ పోరు తెలంగాణ రాజకీయాలను మరింత హీటెక్కించడం ఖాయంగా కన్పిస్తోంది. ఇంతకీ అనర్హత వేటు లిస్టులో ఉన్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్సీ కవిత పోటీ చేస్తే సిట్టింగ్ సీటు దక్కుతుందా? ఇంతకీ కవిత పోటీకి దిగాలని కోరుతున్న ఆ నేత ఎవరు? వాచ్ దిస్ స్టోరీ.కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇప్పుడు బై ఎలక్షన్ టెన్షన్ పట్టుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కండువాను మార్చేశారు. బీఆర్ఎస్ పార్టీకే కాదు..ఎమ్మెల్సీ కవితకు వీర విధేయుడిగా ఉన్న సంజయ్ కుమార్ పార్టీ మారుతాడని ఎవరూ ఊహించ లేదు.

ఐతే ఎమ్మెల్యేల పార్టీ మార్పును సవాల్‌గా తీసుకున్న బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో కేసు వేసింది. దీనిపై ప్రస్తుతం సుప్రీం ధర్మాసనం విచారిస్తోంది.దీంతో సంజయ్‌కు బై ఎలక్షన్ టెన్షన్ పట్టుకుందట. ఎందుకంటే ఓ వైపు బీఆర్ఎస్ నుంచి విమర్శలు రోజురోజుకి తీవ్రతరం అవుతుంటే.. మరో వైపు కాంగ్రెస్ నాయకులు సంజయ్ రాకను ఇప్పటికీ బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు..అంతేకాదు జగిత్యాలలో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సంజయ్‌కి అస్సలు పొసగడంలేదనేది బహిరంగరహస్యం. అధిష్టానం ఇద్దరి మధ్య రాజీకుదర్చాలని ప్రయత్నించినా జీవన్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గడంలేదటఇలాంటి పరిస్థితుల్లో జగిత్యాలలో ఉప ఎన్నిక వస్తే పరిస్థితి ఏంటనే టెన్షన్‌లో సంజయ్ ఉన్నారని లోకల్ టాక్. 2014 ఎన్నికల్లో జగిత్యాలలో బీఆర్ఎస్ తరపున పోటీచేసిన సంజయ్..కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో గెలిచారు. అయితే సంజయ్ గెలుపు కోసం కవిత అంత కష్టపడినా చివరకు సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. దీంతో పార్టీ మారిన సంజయ్ ని ఓడించి రివేంజ్ తీసుకోవాలనుని కవిత భావిస్తున్నట్లు లోకల్ టాక్.సుప్రీంకోర్టు తీర్పుతో ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే..జగిత్యాల నియోజకవర్గంలో తాను పాదయాత్ర చేసి కవితను గెలిపించుకుంటామని ఎమ్మెల్సీ రమణ చేసిన వాఖ్యలు ఇప్పుడు చర్చనీయంశంగా మారాయి. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నిక వస్తే..జగిత్యాలలో కవిత, సంజయ్ ప్రత్యర్ధులుగా నిలబడతారనే టాక్ విన్పిస్తోంది.అయితే సంజయ్ రాకను వ్యతిరేకించిన మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి…బై ఎలక్షన్లో సంజయ్ కి సపోర్ట్ చేస్తారా? లేదా అనేది ఆసక్తికరంగా మారనుంది. జీవన్ రెడ్డి గురించి తెలిసిన వారు మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయరంటూ ఓపెన్ గానే చెప్తేస్తున్నారంట. ఒకవేళ ఉప ఎన్నికల్లో జీవన్ రెడ్డి తనకే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తే మాత్రం సంజయ్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారినా.. కవిత అనుచరులు, పార్టీ క్యాడర్ మాత్రం అలానే ఉన్నారు. జగిత్యాల అభ్యర్థిగా కవిత రంగంలోకి దిగితే వార్ వన్ సైడే అంటోంది గులాబీ దళం. నాడు సంజయ్ గెలుపు కోసముమ్మర ప్రచారం చేసిన కవిత… ఇప్పుడు తన గెలుపు కోసం ఏ రేంజ్ లో ప్రచారం చేస్తారో ఊహించుకోండి అంటున్నాయట పార్టీ శ్రేణులు. ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే జగిత్యాల జగడం రసవత్తరంగా మారనుంది

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »