రూ. 3,04,965 కోట్లతో తెలంగాణ‌ బడ్జెట్

రూ. 3,04,965 కోట్లతో తెలంగాణ‌ బడ్జెట్

– మొద‌టిసారి 3 ల‌క్ష‌ల కోట్లు దాటిన బ‌డ్జెట్
– 6 గ్యాంరెంటీల‌కు కేటాయింపులు
– సంక్షేమం, అభివృద్ధి ల‌క్ష్యంగా బ‌డ్జెట్
– శాస‌నస‌భలో ప్ర‌వేశ పెట్టిన డిప్యూటీ సీఎం భ‌ట్టి

నిర్దేశం, హైదరాబాద్ః

తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ 2025-26 ప్రవేశపెట్టారు. 2025-26 బడ్జెట్ అంచనాలు ఇలా ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 3,04,965 కోట్లు (3 లక్షల 4 వేల 965 కోట్ల రూపాయలు) కాగా, రెవెన్యూ వ్యయం 2,26,982 , మూలధన వ్యయం రూ. 36,504 కోట్లు అని భట్టి విక్రమార్క వెల్లడించారు. పారదర్శకత, జవాబుదారీతనంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని అటు అభివృద్ధితో పాటు ఇటు సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నాం అన్నారు. శాసనమండలిలో శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.

తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి (GSDP) 16,12,579 కోట్లు. గత ఏడాదితో పోల్చితే 10.1 శాతం వృద్ధిరేటు నమోదైంది. దేశ జీడీపీ 3 కోట్ల 31 లక్షల 3 వేల 215 కోట్ల రూపాలు కాగా, వృద్ధిరేటు 9.9 శాతం. తెలంగాణ తలసరి ఆదాయం రూ. 3,79,751 (3 లక్షల 79 వేల 751 రూపాయలు ) కాగా, వృద్ధిరేటు 9.6 శాతం. దేశ తలసరి ఆదాయం రూ.2,05,579, కాగా వృద్ధిరేటు 8.8 శాతం. దేశ తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,74,172 ఎక్కువగా ఉంది.

తెలంగాణ బడ్జెట్ సమగ్ర స్వరూపం..

తెలంగాణ వార్షిక బడ్జెట్‌ 2025 – రూ.3,04,965
రెవెన్యూ వ్యయం – రూ.2,26,982 కోట్లు
మూలధన వ్యయం – రూ.36,504 కోట్లు

శాఖలవారీగా కేటాయింపులు ఇలా..

రైతు భరోసా – రూ.18 వేల కోట్లు
వ్యవసాయ శాఖకు – రూ.24,439 కోట్లు
పశుసంవర్థక శాఖకు – రూ.1,674 కోట్లు
పౌర సరఫరాల శాఖ- రూ.5,734 కోట్లు
విద్య – రూ.23,108 కోట్లు
ఉపాధి కల్పన – రూ.900 కోట్లు
పంచాయతీ రాజ్‌, గ్రామీణ అభివృద్ధి – రూ.31,605 కోట్లు
స్త్రీ, శిశు సంక్షేమం – రూ.2,861 కోట్లు
ఎస్సీ సంక్షేమం – రూ.40,232 కోట్లు
ఎస్టీ సంక్షేమం – రూ.17,169 కోట్లు
బీసీ సంక్షేమం – రూ.11,405 కోట్లు
మైనర్టీ సంక్షేమం – రూ.3,591 కోట్లు
చేనేత – రూ.371 కోట్లు
ఐటీ – రూ.774 కోట్లు
మహిళా శిశు సంక్షేమానికి – రూ. 2,862 కోట్లు
హెచ్ సిటీ డెవలప్మెంట్‌ – రూ.150 కోట్లు
పారిశ్రామిక రంగం – రూ.3,525 కోట్లు
విద్యుత్‌ – రూ.21,221 కోట్లు
వైద్యారోగ్యం – రూ.12,393 కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ధి – రూ.17,677 కోట్లు
నీటిపారుదల – రూ.23,373 కోట్లు
ఆర్‌ అడ్‌ బీ – రూ.5,907 కోట్లు
పర్యాటక రంగం – రూ.775 కోట్లు
సాంస్కృతిక రంగం – రూ.465 కోట్లు
అడవులు-పర్యావరణం – రూ.1,023 కోట్లు
దేవాదాయ, ధర్మాదాయ శాఖ – రూ.190 కోట్లు
శాంతిభద్రతలు – రూ.10,188 కోట్లు
ఇందిరమ్మ ఇళ్లకు – రూ.22,500 కోట్లు
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు చొప్పున 4.50 లక్షల ఇళ్లు
హోంశాఖ-రూ.10,188 కోట్లు
క్రీడలు – రూ.465 కోట్లు
గృహజ్యోతి, ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్‌ కోసం – రూ.3 వేల కోట్లు
ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల కోసం రూ.11,600 కోట్లు

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »