జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు లు యావత్ దళిత జాతికి క్షమాపణ చెప్పాలి
కోరుట్ల, నిర్దేశం :
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి ఆయనే అక్కసుతో అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఏకవచనంతో, అమర్యాదగా మాట్లాడిన మాటలను కాంగ్రెస్ పార్టీ నాయకులు బలిజ రాజిరెడ్డి, మోర్తాడు లక్ష్మీనారాయణ బద్ది మురళి ఖండించారు. ఈ మేరకు సోమవారం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బలిజ రాజి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇటివల జరిగిన అసెంబ్లీ సమావేశంలో శాసనసభాపతి గడ్డం ప్రసాద్ ని ఏకవచనంతో సంబోధిస్తూ అహంకార దుర్వినియోగానికి పాల్పడి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు
మళ్లీ సమర్థించుకుంటున్నారని, వారిని సస్పెండ్ చేయడం శుభ పరిణామమే ఆన్నారు.
ప్రస్తుతం నడుస్తున్న అసెంబ్లీ లో స్పీకర్ గడ్డం ప్రసాద్ ను ఏకవచముతో సంబోధించి అవమాన పరిచిన జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్,హరీష్ రావు యావత్ దళిత జాతికి అసెంబ్లీకి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహించి వారిని ఎక్కడ కూడా తిరగకుండా చేస్తామన్నారు. వారికి వత్తాసు పలుకుతున్న కేటీఆర్, హరీష్ రావు లకు ఎక్కడ సభలు నిర్వహించిన అడ్డుకుంటూ వారిని నిలదీస్తామని వారు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అభివృద్ధి రంగంలో అలాగే సంక్షేమ రంగంలో అనేక ప్రజలకు చేరువవుతున్నదాన్ని చూస్తూ జీర్ణించుకోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు.
యువతకు ఉద్యోగాలు విషయంలో గాని రైతులకు రుణమాఫీ విషయంలో గాని దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య లక్ష్యంగా ముందుకు సాగుతున్నదన్నారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మోర్తాడు లక్ష్మీనారాయణ, మాజీ కౌన్సిలర్ బద్ది మురళి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.