విచారణకు హాజరైన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, నిర్దేశం:
ఫామ్‌హౌస్ కేసులో పోలీసుల విచారణకు హాజరయ్యారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్సీకి మొయినాబాద్ పోలీసులు రెండు సార్లు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఫామ్‌హౌస్‌లో జరిగిన కోడి పందాలపై మొదటి సారి ఇచ్చిన నోలీసులపై పోచంపల్లి సమాధానం ఇచ్చారు. అయితే రెండో సారి మాత్రం వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు పేర్కొన్నారు. దీంతో శుక్రవారం ఉదయం వ్యక్తిగతంగా మొయినాబాద్ పోలీసుల ఎదుట విచారణకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. కాగా.. సంక్రాంతి పండుగ తర్వాత మొయినాబాద్ ఫామ్‌హౌజ్‌లో కోడి పందాలు, క్యాసినో నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఫామ్‌హౌజ్‌పై దాడి చేశారు. కోడిపందాలు, క్యాసినో ఆడుతున్న దాదాపు 64 మంది అదుపులోకి తీసుకున్నారు. అలాగే దాదాపు రూ.30 లక్షల నగదు, 55 లగ్జరీ కార్లు, పందాల కోసం ఉపయోగించే 86 కోళ్లు, కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ అయిన వారిలో 10 మంది తెలంగాణకు చెందిన వారు కాగా.. మిగిలిన వారు అంతా ఏపీ వాసులే. కోడిపందాలు నిర్వహిస్తున్న భూపతిరాజు శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ సింగ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతకు ముందు రెండు మూడు సార్లు కూడా మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో కోడిపందాలు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేబట్టారు. అయితే దర్యాప్తులో భాగంగా ఫామ్‌హౌస్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిదిగా పోలీసులు గుర్తించారు. దీంతో ఆయనకు పోలీసులు మొదటి సారి నోటీసులు ఇవ్వగా.. ఫిబ్రవరి 17 నోటీసులపై వివరణ ఇచ్చారు ఎమ్మెల్సీ. న్యాయవాదితితో కలిసి వచ్చిన పోచంపల్లి ఫామ్‌హౌస్‌కు సంబంధించి లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. అయితే మొయినాబాద్ ఫామ్‌హౌస్ తననే అని 2023లో రమేష్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి లీజుకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. రమేష్‌తో పాటు మరొకరికి కూడా లీజ్‌కు ఇచ్చినట్లు చెప్పారు. లీజ్‌కు ఇచ్చిన భూమిని ఏపీకి చెందిన వ్యాపారి భూపతి రాజు శివ కుమార్ వర్మ అలియాస్ గబ్బర్ సింగ్ తీసుకున్నట్లు తెలిపారు. అయితే కోడిపందాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు ఇచ్చిన లేఖలో వెల్లడిరచారు పోచంపల్లి శ్రీనివాస్. ఇదిలా ఉండగా.. రెండో సారి కూడా పోచంపల్లికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ నోటీసుల్లో పేర్కొనడంతో ఈరోజు పోలీసుల ఎదుట బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ విచారణకు హాజరయ్యారు.