దేశవ్యాప్తంగా గణనీయంగా తగ్గిపోతున్న పులులు, సింహాల సంఖ్య

దేశవ్యాప్తంగా గణనీయంగా తగ్గిపోతున్న పులులు, సింహాల సంఖ్య

 

గాంధీనగర్, నిర్దేశం:
క్రమంగా తగ్గిపోతున్న పులుల సంతతి పరిరక్షణలో గుజరాత్ లోని గిర్ అభయారణ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఆసియాటిక్ సింహాల  సంరక్షణకు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే.. రాష్ట్రంలోని పులులు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నాయని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 చివరికి గత రెండేళ్లలో రాష్ట్రంలో 286 సింహాలు చనిపోయాయని గుజరాత్ ప్రభుత్వం అసెంబ్లీలో అంగీకరించింది. వాటిలో 228 సహజ కారణాల వల్ల మరణించగా, 58 అసహజ మరణాలు సంభవించాయని తెలిపంది. ఈ సంక్షోభం చిరుతపులి సంతతికి కూడా విస్తరించినట్లు గణాంకాలతో సహా వెల్లడించింది. చిరుతల్లో గత రెండేళ్ల కాలంలో 456 మరణాలు సంభవించినట్లు గుర్తించిన అధికారులు. వాటిలో 303 సహజ కారణాల వల్ల, 153 అసహజ కారకాలతో ప్రాణాలు కోల్పోయాయని ప్రకటించిందిగిర్ అభయారణ్యం ద్వారా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్న గుజరాత్ రాష్ట్రంలోని ఏటికేటా. సింహాలు, పులుల్లో అసజహ మరణాల సంఖ్య పెరుగుతుండడం కలవరపెడుతోంది.

ఇదే విషయమై ప్రతిపక్ష ఎమ్మెల్యే శైలేష్ పర్మార్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ..

ఈ గణాంకాలను రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి వివరణ ఇచ్చారు. రెండేళ్ల క్రితం అంటే 2023లో మొత్తంగా 121 సింహాల చనిపోగా, 2024 నాటికి ఆ సంఖ్య 165కు పెరిగిందని అధికారులు తెలిపారు. ఈ మరణాల్లో పెద్ద సింహాలతో పాటు వాటి పిల్లల్లోనూ మరణాలు కనిపిస్తున్నాయని తెలిసింది. గుజరాత్ అధికారుల నివేదిక ప్రకారం.. 2023 నాటి మరణాల్లో.. మొత్తం 58 పెద్ద సింహాలు చనిపోగా, మరో 63 సింహపు పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. ఇక.. 2024 నాటికి ఈ సంఖ్య 85 సింహాలకు పెరగగా.. మరో 80 సింహపు పిల్లలు మృత్యువాత పడ్డాయని తెలిపింది.సింహాల మరణాల్లో సహజ మరణాలు, అసహజ మరణాలుగా వర్గీకరించిన అధికారులు.. సహజ కారణాల వల్ల 102 పెద్ద సింహాలు, 126 పిల్లలు మరణించినట్లు తెలిపారు. అదే సమయంలో అసహజ రీతిలో చనిపోయినట్లుగా గుర్తించిన సింహాల్లో 41 పెద్ద సింహాలు, 17 సింహపు పిల్లలు ఉన్నాయని, ఇవ్వన్నీ అసహజ రీతుల్లో మృత్యువాత పడడమే ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు.మొత్తంగా భారత్లో తరిగిపోతున్న సింహాలు, పులల సంరక్షణకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నా, మరోవైపు అంతే స్థాయిలో సంక్షోభం ఇబ్బంది పెడుతోందని అంటున్నారు. ఈ గణాంకాలు గుజరాత్ రాష్ట్రంలో పెరుగుతున్న సంక్షోభానికి ఉదాహరణలు అని చెబుతున్నారు. గుజరాత్ సింహాల సంఖ్య పరిరక్షణ, ఆవాసాల ముప్పుల గురించి ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని అంటున్నారు. సింహాల మరణాల విషయమై ఆందోళనలు కలిగించే విషయాల్ని వెల్లడించిన తర్వాత.. గుజరాత్ ప్రభుత్వం శాసనసభలో చిరుతపులి మరణాలపై ఆందోళనకరమైన గణాంకాలను వెల్లడించింది. 2023లో 225 చిరుతపులుల మరణాలను ప్రభుత్వం నివేదించింది. ఆ మరుసటి ఏడాది 2024లో మరణాల సంఖ్య స్వల్పంగా పెరిగి 231కి చేరుకున్నట్లు తెలిపింది.రాష్ట్రంలోని చిరుతు పులలో 2023లో 154 పెద్ద చిరుతపులులు, 71 పిల్లలు మరణించినట్లు అధికారులు గుర్తించారు. అలాగే.. 2024లో 162 చిరుతపులులు, 69 పిల్లలు చనిపోయినట్లుగా రికార్టులు వెల్లడిస్తున్నాయి. వీటిలో సహజ కారణాల వల్ల 201 పెద్ద చిరుత పులులు, 102 పిల్లలు మరణించినట్లుగా గుర్తించారు. మొత్తం 303 మరణాలు సంభవించాగా.. వాటిలో 115 చిరుత పులులు, 38 చిన్న కూనలు అసహజ రీతుల్లో చనిపోయినట్లుగా తెలిపారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »