పర్యాటకరంగం లో తెలంగాణ ఐదవ స్థానం

పర్యాటకరంగం లో తెలంగాణ ఐదవ స్థానం

హైదరాబాద్, నిర్దేశం:
పర్యాటకులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నట్లు కనిపిస్తోంది. కేంద్ర పర్యాటక శాఖ విడుదల చేసిన 2024కు సంబంధించిన వార్షిక నివేదిక గణాంకాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి.దేశీయ టూరిస్టులు, విదేశీ పర్యాటకలకు సంబంధించిన వార్షిక నివేదికతో పాటు డిసెంబర్ నెల గణాంకాలను ఈ నివేదిక వేర్వేరుగా వెల్లడించింది. దేశీయ, విదేశీ టూరిస్టులను ఆకర్షించడంలో మెరుగైన ప్రదర్శనను కనబర్చింది. 2024 21,01,020 మంది దేశీయ టూరిస్టులను ఆకర్షించి దేశంలో టాప్‌బె నిలిచింది.23.92 శాతంతో ఢిల్లీ మొదటి స్థానంలో, 20.04 శాతంతో మహారాష్ట్ర రెండోస్థానంలో 7.43 శాతంతో కేరళ మూడోస్థానంలో, 6.99 శాతంలో తమిళనాడు నాలుగో స్థానంలో ఉండగా.. తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. 2024 జనవరి- డిసెంబర్ మధ్య కాలంలో దేశంలో దేశీయ టూరిస్టులు 3,02,30,507 మంది పర్యటించారు.వీరిలో 6.95 శాతం మంది తెలంగాణలో పర్యటించారు. 2023లో 2,78,77,640 మంది పర్యాటకులను ఆకర్షించగా.. ఇందులో రాష్ట్రానికి వచ్చిన వారు 6.7 శాతం మంది అని కేంద్రం వెల్లడించింది. గతేడాది తెలంగాణలో పర్యటించిన పర్యాటకుల్లో పురుషులు 65.83 శాతం కాగా.. మహిళలు 34.17 శాతం ఉన్నట్లు పేర్కొంది.దేశీయ టూరిస్టులను ఆకర్షించడంలో 2024లో దేశంలో ఐదోస్థానంలో నిలిచిన తెలంగాణ.. విదేశీ పర్యాటకుల విషయంలో మాత్రం వెనుకబడిపోయింది. దీంతో విదేశీ టూరిస్టుల వార్షిక నివేదికలో టాప్ చోటు దక్కలేదు. అయితే గతేడాది డిసెంబర్ నెలలో మాత్రం తెలంగాణకు వచ్చే విదేశీ పర్యాటకులు పెరిగారు.2024- డిసెంబర్‌లో దేశానికి 10,28,765 మంది వచ్చారు. వీరిలో 4.67శాతం మంది తెలంగాణకు వచ్చినట్లు కేంద్రం చెప్పింది. దీంతో డిసెంబర్ జాబితాలో మాత్రం ఐద స్థానంలో నిలిచింది. తెలంగాణకు వస్తున్న విదేశీ పర్యాటకుల్లో ఎక్కువ మంది సెలవు రోజుల్లో గడపడానికి, వ్యాపార లావాదేవీల కోసం, మెడికల్ అవసరాల నిమిత్తం వచ్చే వారే ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.ఇందులో అమెరికా నుంచి వచ్చిన వారు 24.38 శాతం, యూకే నుంచి 11.48 శాతం, ఆస్ట్రేలియా నుంచి 10.33 శాతం, బంగ్లాదేశ్ నుంచి 5.91 శాతం, కెనడా నుంచి 5.73 శాతం మంది ఉన్నారు. డిసెంబర్ నెలలో తెలంగాణకు వచ్చిన విదేశీ పర్యాటకుల్లో 54 శాతం మంది పురుషులు ఉండగా.. 46 శాతం మంది మహిళలు ఉన్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »