బోలెరో బోల్తా పడి ఒకరు మృతి..పలువురికి గాయాలు
వరంగల్, నిర్దేశం:
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం పడింది. కూలి పనులకు వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. 28 మందికి గాయాలు అయ్యాయి. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జీడిగడ్డ తండా కు చెందిన కూలీలు పనుల నిమిత్తం వేరే ప్రాంతానికి వెళుతుండగా వాహనం బోల్తా పడింది. * నర్సంపేట మండలం ఇటుకాల పల్లి వద్ద ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ఘటన జరిగింది. డ్రైవర్ పరిమితికి మించి వాహనంలో ఎక్కించుకున్నట్లు సమాచారం.
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. ముగ్గురు మృతి
రమణ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు . ఏలూరు చొదిమెళ్ల వద్ద లారీని ఢీకొట్టి బస్సు బోల్తా పడింది. బస్సు లో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి బస్సు డ్రైవర్ తో పాటు బస్సులో ప్రయాణిస్తున్న 13 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులలో 9 మంది మహిళలు ఉండగా నలుగురు పురుషులు ఉన్నారు వీరిలో బస్సు క్లీనర్ గా పనిచేస్తున్న వ్యక్తి కూడా ఉన్నాడు సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించారు .పోలీసులు హైవే సిబ్బంది రెస్క్యూటివ్ బస్సును రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న బస్సును క్రేన్ సహాయంతో తొలగించారు. బస్సు రోడ్డుపై బోల్తా కొట్టడంతో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. బస్సు ను తొలగించి పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
క్షతగాత్రులను పరామర్శించిన కలెక్టర్
హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు చోదిమెళ్ళ బ్రిడ్జి వద్ద లారీ నీ ఢీకొట్టడంతో బస్సు లో ప్రయాణిస్తున్న 15 మందికి గాయాలు కాగా, ముగ్గురు మృతి చెందారు. బస్సు ప్రమాదంలో
గాయపడిన క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి పరామర్శించారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. వారితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని జీజీహెచ్ వైద్యులను ఆదేశించారు.