మద్యం మత్తులో యువకుడి హత్య
సికింద్రాబాద్., నిర్దేశం:
చిలకలగూడ పిఎస్ పరిధిలో నగేష్ అనే యువకుడు హత్య కు గురయ్యాడు. స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో నగేష్ ను చెక్క కర్రతో కొట్టి నర్సింగ్ హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి తరుణి సూపర్ మార్కెట్ సమీపంలో పెళ్లి ఊరేగింపు జరుగుతున్న క్రమంలో బ్యాండ్ మేళం వాయించే నలుగురు యువకులు మద్యం సేవించారు. ఉప్పరబస్తీ ప్రాంతానికి చెందిన నాగేష్, నర్సింగ్ తో పాటు మరో ఇద్దరు స్నేహితులు మద్యం సేవించిన అనంతరం వారి మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మాట మాట పెరగడంతో క్షణికావేశంలో నర్సింగ్ చెక్క కర్రతో నగేష్ పై దాడికి పాల్పడ్డాడు. నగేష్ తలకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిగా అతని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు నగేష్ ను చంపిన నర్సింగ్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.