గూగుల్ హెడ్ గా మహేష్ బాబు హీరోయిన్
హైదరాబాద్, నిర్దేశం:
కొంతమంది హీరోయిన్లు కేవలం కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితం అవుతారు. పాపం ఈ అమ్మాయి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కడ ఉంది ఏమి చేస్తుంది అని మనం టీవీ లో ఎప్పుడైనా వాళ్లకు సంబంధించిన సినిమా వచ్చినప్పుడు అనుకుంటూ ఉంటాము. కానీ వాళ్ళు స్టార్ హీరోయిన్ కంటే అత్యున్నత హోదాలో ఉన్నారనే విషయం తెలుసుకొని ఆశ్చర్యపోతుంటాము. చాలా మంది హీరోయిన్లు కెరీర్ లో అవకాశాలు తగ్గిన తర్వాత వేరే రంగాన్ని ఎంచుకొని ఉన్నత స్థానాన్ని అధిరోహించిన సందర్భాలు ఉన్నాయి. ఐపీఎస్, రంగంలోకి అడుగుపెట్టి రాణించిన వారు, అదే విధంగా ఐటీ రంగంలో సాఫ్ట్ ఇంజినీర్లు గా రాణించేవాళ్ళు ఉన్నారు. అలాంటి హీరోయిన్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈమె గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి ఒక సినిమా చేసింది. బాలీవుడ్ లో అయితే అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.కానీ ఇప్పుడు ఈమె గూగుల్ కి హెడ్ గా వ్యవహరించే స్థాయికి ఎదిగింది. ఆమె పేరు మయూరి కాంగో. ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబు మూడవ చిత్రం వంశీ లో ఒక హీరోయిన్ గా చేసింది. ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్ నమ్రత శిరోడ్కర్ అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ చిత్రంలో ఒక చిన్న క్యారక్టర్ చేసింది. ఈమె 1995 వ సంవత్సరం లో నసీం అనే బాలీవుడ్ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఆ తర్వాత పలు బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ వచ్చిన ఈమె 2000 సంవత్సరం లో మహేష్ బాబు హీరోగా నటించిన ‘వంశీ’ చిత్రం ద్వారా మన టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమైంది. అప్పటి వరకు ఏడాది కి ఒక్క సినిమా మాత్రమే చేస్తూ వచ్చిన మయూరి, 2000 సంవత్సరం లో మాత్రం 5 సినిమాల్లో నటించింది.ఆ తర్వాత 2003 వ సంవత్సరం లో ఆదిత్య ధిల్లాన్ అనే ప్రముఖ NRI ని పెళ్ళాడి సినిమాలకు దూరమైంది. 2008 వ సంవత్సరం లో మాత్రం ‘కాశ్మీర్ హమారా హై’ అనే సినిమాలో కనిపించింది కానీ, ఆ తర్వాత సినిమాలకు శాశ్వతంగా దూరమైంది. పెళ్లి తర్వాత న్యూ యార్క్ సిటీ లో మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ లో ఎంబియే పూర్తి చేసిన మయూరి, ఆ రంగం లో ఎంతో గొప్పగా రాణించింది. ఎన్నో అంతర్జాతీయ సంస్థల్లో సేవలు అందించిన ఈమె, ప్రస్తుతం గూగుల్ లో ఇండియా ఇండస్ట్రీ హెడ్ ఫర్ ఏజెన్సీ బిజినెస్ రోల్ లో పని చేస్తుంది. ఈమె నెల జీతం లక్షల్లో ఉంటుంది. ఒక స్టార్ హీరోయిన్ సంవత్సరం మొత్తం కష్టపడి పని చేసి సంపాదించే డబ్బులను ఈమె కేవలం ఆరు నెలల్లో సంపాదిస్తుంది. దీనిని బట్టి ప్రస్తుతం ఆమె రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.