గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓట్లలో చెల్లని ఓట్లు…

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓట్లలో చెల్లని ఓట్లు…

ఎలా ఓటు వేయాలో తెలియని అక్షరాస్యులు
మండిపడుతున్న నెటిజన్లు

హైదరాబాద్‌, నిర్దేశం:

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు నమోదు కావడం కలకలం రేపుతోంది. అక్షర జ్ఞానం లేని నిరక్షరాస్యులు కూడా ఓటు ఎలా వేయాలో తెలుసుకొని ఓటేస్తున్నారు.

అయితే నిరక్షరాస్యులు ఇంత సులువుగా చేసిన పని గ్రాడ్యుయేట్లు చేయలేకపోతున్నారు. సరిగ్గా ఓటు వేయకుండా గందరగోళం నెలకొనేలా చేస్తున్నారు.

తాజా గ్రాడ్యుయేట్‌ ఎన్నికల ఫలితాలే దీనికి అతిపెద్ద ఉదాహరణ. ఉభయ రాష్టాల్ర ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో పలు చోట్ల గందరగోళం నెలకొంది. ముఖ్యంగా కరీంనగర్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో వేలకు వేలు చెల్లని ఓట్లు నమోదయ్యాయని తెలుస్తోంది. మొత్తం 2 లక్షల 50 వేల ఓట్లు పోలైతే.. అందులో దాదాపుగా 40 వేల ఓట్ల పైచిలుకు చెల్లనివిగా తేలాయని సమాచారం. దీంతో అంతా షాక్‌ అవుతున్నారు. పట్టభద్రులై ఉండి ఓట్లు సరిగ్గా వేయకపోవడం ఏంటని బిత్తరపోతున్నారు. ఇన్ని చదువులు చదువుకొని కనీసం ఓటు కూడా కరెక్ట్‌గా వేయడం లేదు.. ఇన్ని వేల ఓట్లు చెల్లకపోవడం ఏంటని విస్మయానికి లోనవుతున్నారు. చెల్లని ఓట్లు భారీగా కావడంతో అభ్యర్థులు టెన్షన్‌ పడుతున్నారు. అధికారుల అలసత్వమే దీనికి కారణమని.. ఓటు అవేర్నెస్‌ సరిగ్గా చేయకపోవడం వల్లే ఓటర్లు వేసిన ఓట్లు చెల్లకుండా పోయాయని అంటున్నారు. ఈ విషయంపై ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరా తీశారు. చెల్లని ఓట్ల గురించి తెలుసుకొని ఆయన షాక్‌ అయ్యారు. చదువుకున్న వారికి ఓటు ఎలా వేయాలో కూడా తెలియకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. తగినంత పరిజ్ఞానం లేకపోవడం వల్లే నమోదయ్యాయని తెలుస్తోంది. పట్టభద్రుల అవగాహన లోపంతో ఎక్కువగా చెల్లని ఓట్లు నమోదయ్యాయని వినిపిస్తోంది. కొందరు బ్యాలెట్‌ పేపర్ల విూద రైట్‌ గుర్తుపెట్టగా.. ఇంకొందరు బ్యాలెట్‌ పేపర్‌ తిరగేసి అంకెలు వేశారు. చెల్లని ఓట్ల ఇష్యూ వల్ల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ కౌంటింగ్‌ లేట్‌ అవుతోందని సమాచారం. ఫలితాల్లో ఒక్కో ఓటు కీలకమైన నేపథ్యంలో ఏకంగా వేలకు వేలు ఓట్లు చెల్లనివిగా తేలడంతో అభ్యర్థులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. చదువుకున్న వారు కనీసం ఓటు సరిగ్గా వేయకపోవడం ఏంటి.. అసలు వీళ్లను ఏమనాలి అంటూ ఈ విషయంపై సోషల్‌
విూడియాలో నెటిజన్స్‌ సీరియస్‌ అవుతున్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »