రాష్ట్రవ్యాప్తంగా సీపీఎం పోరుబాట
యాచారం, నిర్దేశం:
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో ఫార్మా సిటీ లో భూములు కోల్పోయిన రైతుల సమస్యలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీ అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జాన్ వేస్లీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎం పార్టీ పోరుబాట కార్యక్రమని నిర్వహిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫార్మసీటి ని రద్దు చేశామని స్పష్టమైన ప్రకటన చెయ్యాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. రైతుల సమస్యలను పరిస్కారం చెయ్యకపోతే ప్రభుత్వం పై సిపిఎం పార్టీ పోరాటం చేస్తుందని ప్రభుత్వని హెచ్చరించారు. రైతులు స్వచ్చందంగా తమ భూములు ఇచ్చినట్లయితే రైతుల భూములను తీసుకోని మార్కెట్ విలువ ప్రకారం డబ్బులు చెల్లించని ప్రభుత్వని కోరారు.
* బలవంతపు భూసేకరణకు సీపీఎం పార్టీ వ్యతిరేకమన్నారు .
* ఫార్మసిటీ ని రద్దు చేసి రైతులకు రుణమాపీ,రైతు భరోసా, రైతు భీమా వంటి పథకాలకు అమలు చెయ్యాలని ప్రభుత్వని కోరారు. జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య మాట్లాడుతూ సాగుకు యోగ్యమైన పంట భూములను తీసుకోని మమ్మలిని బతకుండా చేస్తున్నారు. 4th సిటీ పేరుతో మనలని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. లఘుచెర్ల భూములను తీసుకోని ఫార్మా సిటీ ని ఏర్పాటు చెయ్యాలని ప్రయత్నం చేస్తే సీపీఎం పార్టీ రైతులకు అండగా ఉండి ఫార్మసీటి ని రద్దు చేయించిన చరిత్ర సిపిఎం పార్టీ దక్కుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య తెలిపారు.