గీత పారిశ్రామిక కార్పొరేషన్ కు నిరా కేఫ్ బాధ్యతలు మంత్రి పొన్నం

గీత పారిశ్రామిక కార్పొరేషన్ కు నిరా కేఫ్ బాధ్యతలు
మంత్రి పొన్నం

హైదరాబాద్, నిర్దేశం:
మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను గౌడ సంఘాల నేతలు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ,పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ ,ఇతర గౌడ సంఘాల నేతలు శనివారం కలిసారు. పలు అంశాలను  మంత్రి  దృష్టికి తీసుకొచ్చారు.
మంత్రి మాట్లాడుతూ తెలంగాణ గౌడ సంఘాల పక్షాన గౌడ ప్రముఖులు మాజీ శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, పల్లె లక్ష్మణ్ గౌడ్  నీరా కేకు సంబంధించిన ఇష్యూ , సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి సంబంధించిన అంశం, గౌడ సంఘం భవన నిర్మాణానికి సంబంధించిన మూడు అంశాలను, రాజకీయ ప్రాధాన్యతకు సంబంధించిన అంశాలను నా దృష్టికి తెచ్చారు. నిన్ననే నేను, పిసిసి మహేష్ కుమార్ గౌడ్  ముఖ్యమంత్రి తో మాట్లాడాము. భవన నిర్మాణానికి సంబంధించి ప్రముఖులందరిని కలుపుకొని మార్చ్ తర్వాత భవన నిర్మాణానికి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. ట్యాంక్ బండ్ మీద సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి స్థలం విషయంలో గతంలో చూసిన స్థలం కానీ వేరే స్థలాన్ని చూసే బాధ్యత ముఖ్యమంత్రి  మా ఇద్దరికే అప్పగించారు. నీరాకేఫ్ సంబంధించి టూరిజం ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తో పాటు ఎండి ప్రకాష్ రెడ్డి తో వారి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశాం. బీసీ కార్పొరేషన్ ,గీతా పారిశ్రామిక కార్పొరేషన్ ఎండీ సమావేశంలో పాల్గొన్నారు. ఆనాడు శ్రీనివాస్ గౌడ్ ఒక ఆలోచన చేసి నీరాకేఫ్ ఏర్పాటు చేసి ఉండొచ్చు. ఇప్పుడు దానిపై రాజకీయం చేయడం అనవసరం . మేము కుల ప్రతినిధులుగా కులానికి సంబంధించిన విషయంలో బాధ్యతగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నాం. ఆనాడు నీరాకేఫ్ కట్టే సందర్భంలో  గీతా పారిశ్రామిక కార్పొరేషన్ కు దాని హక్కులు అప్పగిస్తే ఈరోజు ఇబ్బందులు ఉండకపోయేది . సగం సగం చేయడం వల్ల ఈరోజు ఇబ్బందులు ఉన్నాయని అన్నారు.
టూరిజం ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం ఎండీ నీరాకేఫ్ స్థలం టూరిజం శాఖకు సంబంధించినది టర్మ్ అండ్ కండిషన్స్ చేసుకొని నీరాకేఫ్ ను పూర్తి స్థాయిలో గీత పారిశ్రామిక కార్పొరేషన్ కు అప్పగించడానికి నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »