విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలి
-గోదావరిఖని ఏసిపీ మడత రమేష్
మంథని, నిర్దేశం:
విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాల సాధనకు మార్గం ఏర్పాటు చేసుకోవాలని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ అన్నారు. మంథని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మంగళవారం జరిగిన వార్షికోత్సవ వేడుక, సీనియర్స్ వీడ్కోలు పార్టీలో ఏసీపీ మడత రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఏసీపీ మాట్లాడుతూ తల్లి తండ్రులు ఎంతో కష్ట నష్టాలకు ఓర్చి పిల్లలను ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరికను నిజం చేయాల్సిన బాధ్యత పిల్లలపై ఉందన్నారు. నేటి కాలంలో సెల్ ఫోన్లు మంచికి బదులు చేడుకే ఎక్కువ ఉపయోగిస్తున్నారాన్నారు. తప్పుఒప్పులు తెలుసుకొని మంచి వ్యక్తులుగా సమాజం గర్వించే విధంగా ఎదగలన్నారు. కళాశాలలో అధ్యాపకులు చెప్పిన ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలన్నారు. తప్పులు చేస్తేనే తమ దగ్గరకు వస్తారని, ఎలాంటి తప్పులు చేయకుండా ఉంటేనే పోలీస్ స్టేషన్ గడప తొక్కే అవసరం ఉండదన్నారు. నేటి విద్యార్థి దశలో చేసే కొన్ని అనవసర పనులు తాత్కాలికంగా ఆనందం ఇచ్చినా భవిష్యత్తును నాశనం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సయ్యద్ సలీం, మాజీ ప్రిన్సిపాల్ అంబరీష్, అధ్యాపకులు, విద్యార్ధినులు పాల్గొన్నారు.