లక్షలాది నిరుద్యోగులకు ఉద్యోగ అర్హత కల్పించిన ఘనత నరేందర్ రెడ్డిదే
నరేందర్ రెడ్డి గెలుపుకోసం శాయశక్తుల కృషి చేయాలి
కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి
జగిత్యాల, నిర్దేశం:
ఉత్తర తెలంగాణాలో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అర్హత కల్పించిన ఘనత అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి దేనని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పట్టభధ్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు.పట్టభద్రులు అంటే మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగ యువతకు ప్రాతినిధ్యం వహించేది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అంటూ ఆయన పేర్కొన్నారు.
గురువారం జగిత్యాలలో కాంగ్రెస్ నాయకులు, పట్టభధ్రులు తదితరులు లతో జీవన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలు, శాసనమండలి ఎన్నికల కౌంటింగ్, ఫలితాలు వేరువేరుగా ఉంటుందనీ,ఎవరికైతే 50 శాతం ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వస్తాయో వారే గెలిచినట్టు ప్రకటిస్తారని తెలిపారు.
దేశ చరిత్రలో శాసనమండలి ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కింపుతో గెలిచిన వ్యక్తి నేను మాత్రమేనని జీవన్ రెడ్డి చెప్పారు.పాపులారిటీ నరేందర్ రెడ్డితో సాధ్యమవుతుంది అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారన్నారు.మెరుగైన, నాణ్యమైన విద్యా బోధన కోసం నరేందర్ రెడ్డి ఫీజు ల దగ్గర కచ్చితంగా ఉంటాడనీ చెబుతూ గతంలో విద్య కోసం గుంటూరు,నెల్లూరు వైపు వెళ్లే వారనీ,బిఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ సైతం గుంటూరు వెళ్లి చదివారని జీవన్ రెడ్డి గుర్తు చేశారు.అలాంటి సమయంలో నరేందర్ రెడ్డి శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలకు దీటుగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థలను తీసుకొచ్చి విద్యార్థులకు మెరుగైన నాన్యమైన విద్యను అందిస్తున్నాడని పేర్కొన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న మొత్తం ఓటర్లలో 2/3 వంతు ఓట్లు నరేందర్ రెడ్డికి తప్పకుండా వస్థాయని ఆశభావం వ్యక్తం చేశారు. మన ప్రత్యర్థి బిజెపి పార్టీకి కొన్ని సైదాంతిక సిద్ధాంతాలు, మతతత్వ విధానాలు ఉండవచ్చు కానీ అభ్యర్థికి ఎటువంటి సిద్ధాంతాలు లేవనీ జీవన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థి ఓ వ్యాపారవేత్త, ఒక రియల్ ఎస్టేట్ చేస్తాడని, విద్యావంతుడు కాదనీ విద్యావంతులను తీర్చిదిద్దలేదని బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ లౌకిక వాదానికి, సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే సెక్యులర్ పార్టీ అనీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.మన పార్టీ అభ్యర్థికి బిజెపి పార్టీ అభ్యర్థికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు.
మనమందరం కలిసికట్టుగా పనిచేసి నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఎమ్మెల్సీగా గెలుపు కోసం శాయశక్తుల కృషి చేయాలనీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ ఛైర్మెన్లు విజయలక్ష్మి, దేశాయ్,కొత్త మోహన్, మన్సుర్ అలీ,జగదీశ్వర్, జున్ను రాజేందర్, రెపల్లె హరికృష్ణ ముఖేష్ ఖన్నా,పుప్పాల అశోక్, బీరం రాజేష్, పరీక్షిత్ రెడ్డి, స్వామిరెడ్డి, గాజుల రాజేందర్, రఘువిర్ గౌడ్, పిప్పరి అనిత, చిట్ల లత,నేహాల్ రజిత,జయశ్రీ,తదితరులు పాల్గొన్నారు.