నిర్దేశం, న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ కాదని మరోసారి రుజువైంది. హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. హర్యానాలో వరుసగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకున్న భారతీయ జనతా పార్టీ.. జమ్మూ కశ్మీర్ లో తన స్థానాన్ని మరింత మెరుగు పరుచుకుంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్.. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ దారుణ ఓటమి చవి చూసింది.
హర్యానాలో కనీవినీ విజయం
ఎన్నికల ఫలితాల ప్రారంభ దశలో కాంగ్రెస్ వీర విజయంలో కనిపించింది. ఏకంగా 70కి పైగా స్థానాల్లో లీడింగులో కనిపించింది. అంతే, ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో సంబరాలు ప్రారంభమయ్యాయ. సోషల్ మీడియాలో అయితే కాంగ్రెస్ హడావుడి మామూలుగా చేయలేదు. అయితే తొందరపడి ఒక కోయిల ముందే కూసిందన్నట్లు అయింది కాంగ్రెస్ కార్యకర్తల, అభిమానుల పరిస్థితి. ఫలితాలు వస్తున్నాకొద్ది కాంగ్రెస్ క్రమంగా వెనుకబడి పోయింది. బీజేపీ దరిదాపుల్లో కూడా కనిపించకుండా పోయింది. హర్యానాలో బీజేపీకి ఇది కనీవిని ఎరుగని విజయం. మొన్నటి వరకు సంకీర్ణ ప్రభుత్వంతో నెట్టుకొచ్చిన బీజేపీ.. ఇప్పుడు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.
జమ్మూకశ్మీర్ లో బీజేపీ పెర్ఫార్మెన్స్ భేష్
వాస్తవానికి బీజేపీకి ఏమాత్రం అనుకూలంగా జమ్మూ కశ్మీర్ లో కూడా బీజేపీ అద్భుతమైన ఫలితాలనే రాబట్టింది. ప్రభుత్వ ఏర్పాటు వరకు వెళ్లకపోయినప్పటికీ 29 స్థానాల్లో ఆధిక్యం అంటే మామూలు కాదు. ఆర్టికల్ 370 రద్దుపై బయటికి జరిగిన ప్రచారం అంతా అబద్ధమేనని ఈ తీర్పుతో తేలిపోయింది. గతంలో బీజేపీ 25 స్థానాలు సంపాదించగా.. ఈసారి మరో 4 పెంచుకుంది. ఎటూ పోయి ఇక్కడ బొక్కబోర్లా పడ్డది కాంగ్రెస్ పార్టీనే. జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి అతి పెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.