నిర్దేశం: ఇటీవల, ఆపిల్ కొత్త ఐఫోన్ 16 సిరీస్ విడుదల అయింది. దీని ధర రూ.79,900-89,900 ఉంది. అయితే ఈ ఫోన్ ను ఓ వ్యక్తి కేవలం రూ.27 వేలకు మాత్రమే కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని అతడే ఇంటర్నెట్‌లో వెల్లడించాడు. దీంతో నోరెళ్లబెట్టడం నెటిజెన్ల వంతైంది. ఏ ట్రిక్ ఉపయోగించి వ్యక్తి ఐఫోన్ 16 ను ఇంత తక్కువ ధరకు ఎలా కొనుగోలు చేసాడో కూడా చెప్పాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై జనాలు కూడా పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. మరి దాని గురించి తెలుసుకుందాం.
కేవలం రూ.27 వేలకే ఎలా సాధ్యమైంది?
రీసెంట్ గా ఓ వ్యక్తి తాను క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.89 వేల విలువైన ఐఫోన్-16ను కొనుగోలు చేసినట్లు రెడ్డిట్‌లో పోస్ట్ చేశాడు. నిజానికి ఈ వ్యక్తి రివార్డ్ పాయింట్‌లను ఉపయోగించి ఈ ఫోన్‌ని కొనుగోలు చేసారు. ఈ రోజుల్లో చాలా బ్యాంకులు ప్రతి కొనుగోలుపై కొన్ని రివార్డ్ పాయింట్‌లను ఇస్తున్నాయి. వాటిని ఉపయోగించి మీరు డిస్కౌంట్ కూపన్‌లలో లేదా నగదు రూపంలో కూడా రీడీమ్ చేసుకోవచ్చు. ఐఫోన్ 16 కొనుగోలు చేసేటప్పుడు వ్యక్తి రూ.62 వేలకు పైగా రివార్డ్ పాయింట్లను ఉపయోగించాడు. దీంతో ఫోన్ ధర గణనీయంగా తగ్గింది. అతడు కేవలం రూ.27 వేల నగదు చెల్లించి, మిగిలిన మొత్తాన్ని రివార్డ్ పాయింట్ల ద్వారా చెల్లించాడు.
ఇన్ని రివార్డ్ పాయింట్లను ఎలా పొందాలి?
పోస్ట్ వైరల్ అయిన తర్వాత, వారికి ఇన్ని రివార్డ్ పాయింట్లు ఎక్కడి నుండి వచ్చాయోనని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఈ విషయాన్ని కూడా అతడు వెల్లడించాడు. క్రెడిట్ కార్డ్ ద్వారా సుమారు రూ. 15 లక్షలు ఖర్చు చేశానని, దానికి ప్రతిఫలంగా రూ. 62,930 విలువైన రివార్డ్ పాయింట్లు వచ్చినట్లు చెప్పాడు. ఇప్పుడు దీన్ని ఉపయోగించి ఆ వ్యక్తి రూ.90 వేల విలువైన ఐఫోన్ 16ను రూ.27 వేలకు కొనుగోలు చేశాడు.