నిర్దేశం, పాట్నా: బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో వాయుసేన హెలికాప్టర్ వరద నీటిలో ల్యాండ్ అయింది. సాంకేతిక కారణాల వల్ల హెలికాప్టర్ నీటిలో ల్యాండ్ అయిందని వైమానిక దళ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. హెలికాప్టర్ లో ఇద్దరు పైలట్లతో సహా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఈ సంఘటన ఔరైలోని మధుబన్ బేసిలో జరిగింది.
రిలీఫ్ మెటీరియల్ ఇచ్చి తిరిగి వస్తుంటే..
దీనిపై ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది. ప్రమాదం ఎందుకు జరిగింది? తప్పు ఎవరిది? వంటి ప్రశ్నలకు వైమానిక దళం సమాధానం చెప్పలేదు. వైమానిక దళ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ హెలికాప్టర్ బీహార్‌లోని సీతామర్హి జిల్లాలో వరద బాధితులకు ఆహారం, ఇతర వస్తువులను పంపిణీ చేసి తిరిగి వస్తోంది. ప్రస్తుతం దీనిపై విచారణ చస్తున్నట్లు తెలుస్తోంది.
హెలికాప్టర్‌ను నీటి నుంచి బయటకు తీస్తున్నారు
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హెలికాప్టర్‌లో ఉన్నవారంతా క్షేమంగా ఉన్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హెలికాప్టర్‌ని బయటకు తీస్తున్నారు. బీహార్‌లోని కోసి సహా ఇతర నదులలో వరద ఎక్కువగా ఉంది. దీని కారణంగా చంపారన్‌లోని బెట్టియాలో రింగ్ డ్యామ్ తెగిపోయింది. అంతకుముందు, వరద నీటి కారణంగా బగహ డ్యామ్ కూడా విరిగిపోయింది. సైన్యం ఇక్కడ సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది. హెలికాప్టర్ ఇంజిన్ ఫెయిల్ అయిందని, ఆ తర్వాత పైలట్ వాటర్ ల్యాండింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు.