నిర్దేశం, హైదరాబాద్ః హైదరాబాద్ లో హై లెవెల్ లో దూసుకుపోతున్న హైడ్రాకు చెక్ పడ్డట్టే కనిపిస్తోంది. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో హైడ్రా కమిషన్ రంగనాథ్ ను వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సోమవారం తమ ముందు హారజై వివరణ ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. నిజానికి హైడ్రా కూల్చివేతలపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఈ విషయమై కొందరు కోర్టును సైతం ఆశ్రయిస్తున్నారు.ఈ నేపథ్యంలో హైకోర్టు ఈ విషయంపై దృష్టి సారించింది.