ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పీడ్..
– పొలిటికల్ లీడర్ లను వదిలి పెట్టం..
– సీపీ శ్రీనివాస్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ బృందం వేగం పెంచింది. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన వారి భరతం పట్టామన్నారు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ లో సాక్ష్యాలను మాయం చేయడానికి చేసిన ప్రయత్నాలను నిర్వీర్యం చేశామన్నారు ఆయన. ఇప్పటికే ఈ కేసుతో సంబందం ఉన్న పోలీసు అధికారులను అరెస్టు చేసామని సీపీ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ తో సంబందం ఉన్న పోలీసు ఉన్నతాధికారులను, పొలిటికల్ లీడర్ లను వదిలి పెట్టమన్నారు ఆయన. ఇప్పటికే లుకౌట్ నోటీస్ లు ఇచ్చామని, రెడ్ కార్నర్ నోటీస్ లు జారీ చేయడానికి కోర్టు ప్రాసెస్ కొనసాగుతోందని వివరించారు.