కంటోన్మెంట్ లో కాంగ్రెస్ ప్రచారం
నిర్దేశం, సికింద్రాబాద్ :
కంటోన్మెంట్ ఉప ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేష్ మొండా మార్కెట్ డివిజన్ పరిధిలోని లోహియా నగర్, వడ్డెర బస్తి ప్రాంతాలలో ఇంటింటా తిరుగుతూ కాంగ్రెస్ కు ఓటు వేయాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఆరు గ్యారెంటీలు పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారని, కంటోన్మెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పేద ప్రజల పక్షాన వారి అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ దోహదపడుతుందని అన్నారు.