గాల్లో చెక్కర్లు కొడుతున్న విమానం
మంథని
పెద్దపల్లి జిల్లా మంథని ముత్తారం మండలంలో గత పది రోజులుగా మానేరు నది పరివాహక ప్రాంతంలో ఒక జెట్ విమానం చెక్కర్లు కొడుతోంది. దాంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ విమానం ఎందుకు తిరుగుతుందో అధికారులకు కూడా సమాచారం లేదని సమాచారం. వివరాలు తెలియక ప్రజలు అయోమయంలో వున్నారు.