ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు

ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు
తెలంగాణలో మే13 న పోలింగ్
జూన్ 4న కౌంటింగ్
నిర్దేశం, న్యూఢిల్లీ:
లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసింది. పోలింగ్ వివరాలు వెల్లడించింది. సీఈసీ రాజీవ్ కుమార్ పూర్తి షెడ్యూల్‌ని వెల్లడించారు. లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఎన్నికల తేదీలు ప్రకటించారు. 7 విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్ 19 నుంచి ఈ ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్‌ జరగనున్నట్టు ఈసీ వెల్లడించింది. ఏప్రిల్ 19న తొలి విడత లోక్‌సభ పోలింగ్‌ మొదలవుతుంది. ఏప్రిల్ 26న రెండో దశ ఎన్నికలు జరుగుతాయి. మే7వ తేదీన మూడో దశ, మే 13 న నాలుగో దశ పోలింగ్ జరుగుతుందని ఈసీ స్పష్టం చేసింది.

మే 20న ఐదో దశ, మే 25న ఆరో దశ, జూన్ 1వ తేదీన ఏడో దశ పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఒకేసారి ఫలితాలు విడుదలవుతాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 లోక్‌సభ సీట్లున్నాయి. ఇక్కడ ఏప్రిల్ 19న ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక సిక్కిం విషయానికొస్తే ఏప్రిల్ 19వ తేదీన మొత్తం 32 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఒడిశాలో రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్టు రాజీవ్ కుమార్ వెల్లడించారు. మే 13వ తేదీన తొలి విడత, మే 20న మలి విడత పోలింగ్ జరగనుంది.

ఏపీలో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయి.
17వ లోక్‌సభ పదవీకాలం 16 జూన్ 2014తో ముగియనుంది. అంతకు ముందు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. దేశంలో మొత్తం 543 లోక్‌సభ స్థానాలు ఉండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీ లేదా కూటమికి మెజారిటీ 272 సీట్లు అవసరం. 2019 లోక్‌సభ ఎన్నికల గురించి మాట్లాడుతూ, ఏప్రిల్ 11 నుంచి మే 19 మధ్య 7 దశల్లో ఓటింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. మే 23 న ఫలితాలు ప్రకటించనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్ కుమార్ తెలిపారు. అలాగే 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. బీహార్, గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, హిమాచల్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 26 అసెంబ్లీలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.

పోలింగ్ తేదీలుః
మొదటి దశ – ఏప్రిల్ 19 – మొత్తం 102 స్థానాలకు ఎన్నికలు
రెండవ దశ – 26 ఏప్రిల్ – మొత్తం స్థానాలు – 89
మూడవ దశ – 7 మే – మొత్తం స్థానాలు – 94
నాల్గవ దశ – 13 మే – మొత్తం స్థానాలు – 96
5వ దశ – 20 మే – మొత్తం స్థానాలు – 49
ఆరవ దశ- 25 మే – మొత్తం స్థానాలు – 57

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »