చిన్నారులతో బిక్షటన
నిర్దేశం, నిజామాబాద్ :
ముద్దుగా కనిపించే చిన్నారులను దివ్యాంగులుగా మార్చి యాచక వృత్తిలోకి దింపుతున్నాడు ఓ కర్కాటకుడైన దివ్యాంగుడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం 80 క్వాటర్స్ కి చెందిన ఈ దుర్మార్గుడు ముక్కుపచ్చలారని చిన్నారులను ఎత్తు కొచ్చి వారినతో బిక్షటన చేయిస్తున్నట్లు తెలుస్తోంది.
చిన్నారులను ఎత్తుకెళుతున్న సంఘటనల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఐదవ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దురాగతానికి పాల్పడింది దివ్యాంగుడని పోలీసులు తేల్చడంతో మండిపడుతున్నారు స్థానిక ప్రజలు. బాలల సంరక్షణ అధికారులు ఆ బాధిత చిన్నారులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకరు వరంగల్ కు చెందిన బాలుడు కాగా మరొకరు చార్మినార్ కు చెందిన బాలుడిగా గుర్తించినట్టు సమాచారం. బిక్షటన పేరుతో చిన్నారులను కిడ్నాప్ చేస్తున్న ముఠాపై విచారణ చేస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సింగన్ వార్ కల్మే శ్వర్ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.