శాస్త్రీయ ఆలోచనలు విజ్ఞానం, వివేకంను పెంపొందిస్తాయి
– ఎస్సై జి. రమేష్
నిర్దేశం, నిజామాబాద్ :
శాస్త్రీయ ఆలోచనలు విజ్ఞానం, వివేకంను పెంపొందిస్తాయని, ఆధునిక ప్రపంచంలో శాస్త్ర సాంకేతికత ప్రతిదీ సైన్స్ తో ముడిపడి ఉన్నాయని సబ్ ఇన్స్పెక్టర్ జి. రమేష్ అన్నారు. నేడు జాతీయ సైన్స్ దినోత్సవం (ఫిబ్రవరి 28) పురస్కరించుకొని సత్యశోధక్ పాఠశాలలో “శాస్త్రీయ విజ్ఞాన ప్రదర్శన” ఏర్పాటు చేశారు. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త నోబెల్ అవార్డు గ్రహీత సి.వి. రామన్ చిత్ర పటానికి యస్.ఐ జి. రమేష్, ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్య తో కలిసి పూలమాల వేశారు. స్కూల్ లో విజ్ఞాన ప్రదర్శనను ప్రారంభించారు. విద్యార్థులలో నిగూఢమైన ప్రతిభను వెలికి వేయడానికి, వినూత్న ఆలోచనలను రేకేత్తించడంలో సైన్స్ పాత్ర ప్రధానమైనదని, జీవ పరిణామంలోని పరిణామమనేది సమస్త ప్రపంచ మానవాళి ఎదుగుదలకు నాంది అన్నారు ఎస్సై.
సైన్స్ అంటేనే సెన్స్ అని ప్రయోగాత్మకంగా ఋజువు ఫలితం ఆమోద యోగ్యమవుతేనే అంగీకరించబడుతుందన్నారు. మూఢనమ్మకాలు, సాంఘిక దురచారాలు, అశాస్త్రీయత భావాలను రూపమాపడంలో విద్యావంతుల పాత్ర కీలకమన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సైన్స్ నమూనాలు, వినూత్న పరికరాలు, ప్రత్యేకించి వ్యవసాయ ఆధారిత పనిముట్ల సాదనాలు ఎంతగానో ఆకర్షిణీయంగా ఉన్నాయని తెలిపారు. రేపటి సమాజ నిర్మాణంలో భాగస్వాములైన నేటి బాలలను ఉత్తమంగా తీర్చిదిద్దుతున్న పాఠశాల యాజమాన్యంను ప్రత్యేకంగా అభినందించనైనది. ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్, చిత్రలేఖనం, ఉపన్యాసం మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించనైనది.