చేయూత వాలంటీర్ శారధ ఇకలేరు

చేయూత స్వచ్ఛంద సంస్థ

వాలంటీర్ శారధ ఇకలేరు

ఔను…. ఆమెకు పేదలకు వైద్య సేవలందించడం అంటే ఎంతో ఇష్టం.. ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తూనే ఇంటి వద్దకు వచ్చే పేదలకు ఉచితంగా వైద్య సేవలందించి అందరి హృదయాలలో చోటు సంపాదించింది శారద. మంగళవారం ఆనారోగ్యంతో ఆమె మరణించిందనే వార్తను ఆర్మూర్ ప్రాంతంలో ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు.

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తొర్తి గ్రామానికి చెందిన శారధ (45) మోర్తాడ్  ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  ఎఎన్ఎం గా పని చేస్తుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. బాబు 7వ తరగతి చదువుతుండగా, బేబి మానసిక వికలాంగురాలు. అయితే.. ఇంటి పనులు చేస్తూనే నర్సింగ్ గా వైద్య సేవలందించే శారధ ఆర్మూర్ చేయూత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మధుశేఖర్ ఆధ్వర్యంలో పేదలకు అందించే ఉచిత మైనర్ సర్జికల్ క్యాంపులు నిర్వహిస్తారు. ఇగో.. ఆ క్యాంపులలో  యాక్టివ్ గా పాల్గొనేది శారద. ఇరువై మూడేళ్లుగా ఆర్మూర్ డివిజన్ లో వైద్య సేవలందించిన శారధ లేదనే నిజాన్ని నమ్మలేక పోతున్నారు జనం.

శారధ వైద్య సేవలు మరిచి పోలేను..

: డాక్టర్ మధుశేఖర్

శారద చేయూత కుటుంబంలో చాలా సిన్సియర్ వినయపూర్వకమైన ఆప్యాయత కలిగిన సభ్యురాలు. ఆమె చేయూత యొక్క అన్ని కార్యక్రమాలలో ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆమె భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో అవిశ్రాంతంగా పోరాడుతోంది. ఆమెకు చికిత్స అందించడానికి అన్ని విధాల కృషి చేసినా ఆమె జీవితాన్ని కొద్దిసేపు పొడిగించవచ్చు కానీ అనివార్యమైన మరణం నుండి ఆమెను రక్షించలేకపోయింది.

తోర్తి గ్రామంలో ANM మరియు చేయూత శిబిరాల ఆపరేషన్ థియేటర్‌లో సోదరిగా ఆమె చేసిన గొప్ప సేవకు అందరూ ఆమెను గుర్తుంచుకుంటారు… ప్రార్థనలు ఆమె ఆత్మకు శాంతి కలగాలని. శారద కుటుంబ సభ్యులందరికీ మరియు చేయూత గ్రూపులో ఉన్న చక్రి, గౌతమిలకు ప్రగాఢ సానుభూతి.paid last respects to the departed soul of sharada along with DrNagaraju, Vinay, Ashok , Rakesh , Amzad and others

శారధ సిస్టర్ మీకు జోహార్లు..

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »