ఫేక్ సర్టిఫికెట్లతో లోన్లు ఇప్పిస్తున్న ముఠా అరెస్ట్

ఫేక్ సర్టిఫికెట్లతో లోన్లు ఇప్పిస్తున్న ముఠా అరెస్ట్

నిర్దేశం, హైదరాబాద్ :
వెయ్యికి పైగా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి హోం లోన్స్ ఇప్పిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా ఒక ముఠా గా ఏర్పడి ప్రభుత్వ అధికారుల సంతకాలతో , వారి హోదా పేరు పై రబ్బర్ స్టాంప్ లు తయారుచేసి మోసాలకు పాల్పడుతున్నారు. బాలనగర్ తో పాటు కూకట్పల్లి ఎస్ఓటి పోలీసులు ఈ కేసును చేదించారు. 18 మంది ముఠా సభ్యులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

వీరిపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. మీరు వద్ద నుండి 1180 నకిలీ సర్టిఫికెట్లతోపాటు 687 ఫేక్ రబ్బర్ స్టాంపులు, 10 లాప్టాప్ లతో కలిపి మొత్తం 10 కోట్ల విలువ చేసే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. హోమ్ లోన్ కు మొదట కస్టమర్ అప్లై చేసుకుంటాడు.

వివిధ కారణాల చేత అతడి హోమ్ లోన్ రిజెక్ట్ అవుతుంది. దీంతో ఎలాగైనా హోమ్ లోన్ కావాలనుకునే కస్టమర్లు లోన్ కన్సల్టెంట్లను ఏజెంట్లను సంప్రదిస్తున్నారు. అలాంటి ఏజెంట్ లను పెట్టుకుని ఒక ముఠాగా ఏర్పడి గంట రంగారావు అనే వ్యక్తి లీడ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వివిధ కారణాలు చేత తిరస్కరించబడిన లోన్ ను కొన్ని ఫేక్ సర్టిఫికెట్లు క్రియేట్ చేసి కస్టమర్లకు లోన్ వచ్చేలాగా చేస్తుంది ఈ ముఠా. వీటికోసం జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ రెవెన్యూ శాఖల అధికారుల రబ్బర్ స్టాంప్, నకిలీ సర్టిఫికెట్ల ఉపయోగించి నేరానికి పాల్పడుతున్నారు.

మొత్తం మూడు విధానాల్లో ఈ ఫ్రాడ్ జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాను లీడ్ చేస్తున్న రంగారావు కింద ముగ్గురు ఏజెంట్లు ఉంటారు . ఒకరు రబ్బర్ స్టాంప్ క్రియేట్ చేస్తే, మరొకరు నకిలీ సర్టిఫికెట్ తయారు చేస్తారు. ఇంకొకరు లేఅవుట్ ప్లాన్ టెంపర్ చేస్తారు.. లోన్ తిరస్కరించబడిన కస్టమర్ మొదట ఏజెంట్ను సంప్రదిస్తాడు.. ఏజెంట్ తన లీడర్ రంగారావు దగ్గరికి కస్టమర్ ను తీసుకెళ్తాడు.

 

 

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »