దోస్త్ మేరా దోస్త్
అంటున్న బీజేపీ – బీఆర్‌ఎస్
సీక్రెట్ ఒప్పందం?
ఢల్లీి లిక్కర్ కేసులో నోటీసులతో సరిపెడతారా.. కవిత అరెస్ట్ చేస్తారా..?
బండి సంజయ్‌ను తప్పించడం వల్ల బీజేపీకి లాభమా..? నష్టమా..?
తెలంగాణ ప్రజలు తెలివైనోళ్లు. ప్రతి ఆంశాన్ని గమనిస్తుంటారు. బీఆర్‌ఎస్ కు ప్రత్యాహ్నయం బీజేపీ అనేది ఒకప్పటి మాట. కానీ, ఇప్పుడు బీఆర్‌ఎస్ ను ఓడిరచి అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌కే సాధ్యం అంటున్నారు ఆ పార్టీ శ్రేణులు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల తెలంగాణలో బూస్ట్ ఇచ్చింది. అప్పటి వరకు అధికార బీఆర్‌ఎస్‌కు పోటీ బీజేపీ అనేది అందరి నోట వినిపించిన మాట. కానీ.. దోస్త్ మేరా దోస్త్ అంటూ సెంటర్‌లో బీజేపీ.. బీఆర్‌ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందనేది జగమెరిగిన సత్యం. ఎపిషోడ్ లను మరిపించే విధంగా ఢల్లీి లిక్కర్ కేసును విచారించిన ఈడీ అధికారులు సైలెన్స్ ఎందుకయ్యారనేది బీజేపీ పెద్దలే చెప్పాలి.
నిర్దేశం, హైదరాబాద్ :
ప్రత్యేక తెలంగాణ సెంటిమెంట్‌తో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ కు గట్టి పోటీ ఎదురవుతోంది. రాబోయే అసెం బ్లీ ఎన్నికలలో బీజేపీతోనే పోటీ అని మేక పోతు గంబీరాన్ని ప్రదర్శిస్తుంది బీఆర్‌ఎస్. అయినా.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ అనే వాయిస్‌ను పబ్లిక్‌లోకి తీసుకెళ్లడంలో కొంత మేర కాంగ్రెస్ సక్సెస్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధికార పార్టీని ఎప్పటికప్పుడు అటాక్ చేస్తూ ప్రజలలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుతున్నాడు.
కాంగ్రెస్ పార్టీ అంటెనే గ్రూప్ రాజకీయాలు..
కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు తగ్గు ముఖం పట్టడానికి రాహుల్ గాంధీ ప్రత్యేక చొరవ చూపడమే కారణంగా చెబుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలోని గ్రూప్ రాజకీ యాలు ప్రత్యార్థులకు లాభం చేసింది. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్ తమ పార్టీలోకి చేర్చుకుని కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తీశాడు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు రాజకీయ భవిష్యత్ లేకుండా చేయడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యా రు. అయితే.. మారిన రాజకీయ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు పుంజుకుంటోం ది. ముఖ్యంగా బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటనే టాక్ పబ్లిక్‌లోకి వెళ్లడంతో కాంగ్రెస్‌కు రాజకీయ మైలేజ్ పెరిగింది.
ఢల్లీి లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ లేనట్లేనా..?
ఢల్లీి లిక్కర్ కేసును ఆఘమేఘాల మీద విచా రించిన ఈడీ అధికారులు మౌనవ్రతం పట్టా రు. సీఎం కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితను పలుమార్లు లిక్కర్ కేసులో విచారణకు పిలిచిన ఈడీ అధికారులు ఇప్పుడు జోష్ తగ్గించారు.
బీజేపీ.. బీఆర్‌ఎస్ రహస్య ఒప్పందంలో భాగంగానే కవితను అరెస్ట్ చేయద్దని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో మళ్లీ బీజేపీ రావడానికి బీఆర్‌ఎస్ ఎంపీల మద్దతు ఇవ్వాలనే ఒప్పందంతోనే ఢల్లీి లిక్కర్ కేసు డీలా పడి పోయిందనేది టాక్.
తాజాగా లిక్కర్ కేసు నిందితుడు రాంచందర్ పిళ్లె అప్రోవర్‌గా మారడంతంతో కవిత లిక్కర్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా కవితకు ఈడీ గురువారం మరోసారి నోటీసులు జారీ చేసింది.
లిక్కర్ స్కాం కేసులో రేపు విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. కాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా కొనసాగిన బండి సంజయ్‌ను తప్పించి సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఆ పదవి ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి లాభమవు తుంది. బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటనే టాక్ తో ముస్లీంలు కాంగ్రెస్ లేదా బీఎస్‌పి వైపు ఆలోచన చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఊహించని ఫలితాలు వస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడు తున్నారు.
కవితకు మరోసారి ఈడీ నోటీసులు
ఢల్లీి లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వికుంట్ల కవితకు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. శుక్రవారం విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కేసులో నిందితుడిగా ఉన్నా అరుణ్ రాంచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారిన తరువాత కవితను విచారణకు పిలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
రాంచంద్ర పిళ్లై సీఆర్‌పిసి సెక్షన్ 164 కింద ప్రత్యేక న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది. అరుణ్ రాంచంద్రన్ పిళ్లై ఎమ్మెల్సీ కవిత బినామీగా ఈడీ ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఇటీవల కవిత మాజీ ఆడిటర్‌ను సైతం ఈడీ విచారించిన సంగతి తెలిసిందే.
– యాటకర్ల మల్లేష్
949 222 5111