డాక్టర్ మధుశేఖర్ కు ఘన స్వాగతం
అర్గుల్ లో తండ్రి సమాది వద్ద నివాళులు..
నిర్దేశం, ఆర్మూర్ : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ ఛైర్పర్సన్ డా.మధు శేఖర్ హైదరాబాద్ లో బాధ్యతలు స్వీకరణ తరువాత మొదటి సారి శనివారం ఆర్మూర్ విచ్చేసిన సందర్భంగా శ్రేయోభిలాషులుల, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.
ఆర్మూర్ పట్టణంలోని అంబెద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన మధుశేఖర్ నివాళులు అర్పించారు. ఆ తరువాత జక్రాన్ పల్లి మండలం అర్గుల్ గ్రామ శివారలో గల తన తండ్రి పోస్ట్ లింగయ్య సమాధి వద్దకు చేరుకున్న మధుశేఖర్ నివాళులు అర్పించారు. అనంతరం వేల్పూర్ క్రాస్ రోడ్ వద్ద గల స్వర్గీయ సురేందర్ రెడ్డి విగ్రహానికి పూల దండ సమర్పించి నివాళులు అర్పించారు.
డాక్టర్ మధుశేఖర్ వెంట జక్రాన్ పల్లి మాజీ ఎంపీపీ అనంత్ రెడ్డి, చేయూత స్వచ్ఛంద సంస్థ వాలంటీరులు మానస గణేష్, కలిగోట్ గంగాధర్, రాకేష్, జనార్ధన్ గౌడ్, ప్రగతి సుధర్శన్ తదితరులు ఉన్నారు.