కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా ప్రతి పక్షాల అడుగులు

కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా ప్రతి పక్షాల అడుగులు

ఈ ఎన్నికలలో కింగ్ మేకర్ గా కనిపిస్తున్న బిఎస్ పి అధినేత డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్..

పబ్లిక్ లో బీఆర్ ఎస్ – బీజేపీ ఒక్కటే అనే టాక్..

కాంగ్రెస్ – ప్రతి పక్షాల ఎన్నికల పొత్తుతో బీఆర్ ఎస్ కు బీటలు..

కేసీఆర్ కుటుంబ పాలనపై కన్నెర్ర చేస్తున్న ప్రజలు..

కాంగ్రెస్ – బిఎస్ పి పొత్తు లేకుంటే బీఆర్ఎస్ కే లాభం..?

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హిట్ ఎక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే ఎన్నికల వాతవరణం కనిపిస్తోంది. బీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించడం వల్ల ఎన్నికల ప్రసారంకు శ్రీకారం చుట్టారు.

మళ్లీ అధికారంలోకి రావాలని బీఆర్ ఎస్ భావిస్తోంది. సంక్షేమ పథకాల ఓట్లు తమను గెలిపిస్తాయనే నమ్మకం వారిలో ఉంది. కానీ.. బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బడుగు, బలహీన వర్గాలను ఓట్ల బ్యాంక్ గా మలుసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు కాంగ్రెస్ – బిఎస్ పి ఎన్నికల పొత్తు తెరపైకి వచ్చింది.

కేసీఆర్.. కేటీఆర్.. కల్వకుంట్ల కవిత.. హరీష్ రావు.. సంతోష్ రావు ప్రభుత్వం అంటె వీరెనా అనే టాక్ పబ్లిక్ లోకి వెళ్లింది. తొమ్మిది ఏళ్ల పాలనలో ఈ కుటుంబం ఆర్థికంగా పెరిగిన ఆస్తుల గురించి ప్రజలలోకి తీసుకెళ్లడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది. తాజా రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తే కాంగ్రెస్ – బిఎస్ పి ఎన్నికల పొత్తుతో అడుగులు వేస్తే 80 సీట్లకు పైగానే రావచ్చానే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు పొలిటికల్ పండితులు.

కాంగ్రెస్ – బిఎస్ పి వైపు చూస్తున్న మైనార్టీలు..

అధికార బీఆర్ ఎస్ – బీజేపీ ఒక్కటే అనే ఫీలింగ్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్, బిఎస్ పి సక్సెస్ అయ్యింది. బీజేపీని బద్ద శతృవుగా భావించే మైనార్టీ వర్గాలు కాంగ్రెస్ లేదా బిఎస్ పికి అనుకూలంగా మారుతున్నారు. ఢిల్లీ మధ్యం కేసులో సీఎం కేసీఆర్ ముద్దుల బిడ్డ కల్వకుంట్ల కవిత ఉందని పలుమార్లు పిలిపించి విచారణ చేసిన ఈడి అధికారులు మౌణంగా ఉండటం వెనుక బీఆర్ ఎస్ – బీజేపీ రాజీపడ్డాయనే టాక్ పబ్లిక్ లో ఉంది. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ను తప్పించి అతని స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించడం వెనుక కేసీఆర్ వ్యూహం ఉందనే టాక్ పబ్లిక్ లో ఉంది.

కాంగ్రెస్ – బిఎస్ పి ఒక్కటైతే..

మారుతున్న రాజకీయాలను విశ్లేషిస్తే అధికార పార్టీ బీఆర్ ఎస్ ను గద్దె దించడమే ధ్యేయంగా బిఎస్ పితో పాటు వామ పక్షాలు కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తుకు సై అంటున్నాయి. గతంలో జరిగిన మునుగొడు ఎన్నికలలో కమ్యూనిష్టు పార్టీల సహాకారంతో బీఆర్ఎస్ ఎన్నికలలో గెలిసిన తరువాత వారిని దూరం పెట్టింది. యూజ్ అండ్ త్రూ అలవాటు గల కేసీఆర్ ను నమ్మి మోస పోయామని వామపక్షాలు బాధ పడుతున్నాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని బీఆర్ఎస్ ను గద్దెదించడం ధ్యేయంగా ముందుకు వెళ్లాలని వామపక్షాలు భావిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో చర్చాలు జరిపినట్లు తెలుస్లోంది.

అసెంబ్లీ ఎన్నికలలో బిఎస్ పి కీలకం..

ఐపిఎస్ ఆఫీసర్ గా ఎంతో భవిష్యత్ ఉన్నప్పటికీ ఆ పదవికి రాజీనామా చేశారు డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్. బహుజనులు రాజ్యాధికారంలోకి రావాలనే ఏకైక లక్ష్యంతో బిఎస్ పీ రాజకీయాల్లోకి వచ్చిన అతను తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలు చేసి బిఎస్పికి బూస్ట్ ఇచ్చాడు. రాష్ట్రంలోని ప్రతి నియోజక వర్గంలో బిఎస్ పి తనకంటూ బ్యాంక్ ఓటును సంపాదించుకుంది. బిఎస్ పి అధినేత మాయవతి హైదరాబాద్ లో జరిగిన బహిరంగ సభలో డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించారు. అయితే… బిఎస్ పి రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవడంలో సక్సెస్ అయ్యింది. టీఎస్ పిఎస్ సి పేపర్ లీకేజ్.. గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా.. మైనార్టీ యువకుడి హత్య తదితర ఆంశాలలో బిఎస్ పి నేత డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఉద్యమించండంతో బిఎస్ పి ప్రజలల్లోకి వెళ్లింది. ఓట్లు మావి.. అధికారం మీదా..? అంటూ విద్యార్థులు, యువత ఆలోచిస్తోందంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు..

సీట్లు పరిమితం కావచ్చు.. కానీ..

రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ – బిఎస్ పి పొత్తు లేకుంటే బీఆర్ ఎస్ కు లాభం. బిఎస్ పి సీట్లు పరిమితం కావచ్చు.. కానీ.. ఓట్ల ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కవే ఉంటుంది. ఒక్కో నియోజక వర్గంలో పదిహేను వేలకు ఓట్లకు పైగానే ప్రభావం చూపిస్తోందనేది పొలిటికల్ విశ్లేషకుల టాక్. ఈ తాజా రాజకీయ పరిస్థితులలో కాంగ్రెస్ – బిఎస్ పి ఎన్నికల పొత్తుతో అసెంబ్లీ ఎన్నికలలో ముందుకు వెళ్లితే బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల సీట్లు 30 కి కట్టడి చేయచ్చాంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు.

ప్రతిపక్ష పార్టీలను ఐక్యం చేసి బీఆర్ ఎస్ ను గద్దె దించడమే ధ్యేయంగా తెలంగాణ జన సమితి పార్టీ వ్యవస్థాపకులు ప్రొపెషర్ కోదండరామ్ కూడా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై బిఎస్ పి, వామపక్షాలతో కలిసి ఉద్యమించిన అతను ఎన్నికల పొత్తులో భాగంగా అందరిని కలుపుకుని బీఆర్ఎస్ గద్దె దించడానికి పలువురితో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.

 

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »