ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ప్రజల ఆశీర్వాద ర్యాలీ
నిజామాబాద్, ఆగష్టు 24 : ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జోష్ మీద ఉన్నాడు. సీఎం కేసీఆర్ తనకు టిక్కెట్ ప్రకటించడంతో ముచ్చటగా మూడవ సారి ఎమ్మెల్యేగా గెలిసి హ్యాట్రిక్ సాధించాలని అతను వ్యూహాలు రూపొందిస్తున్నాడు. టిక్కెట్ ప్రకటించిన తరువాత మొదటి సారి శుక్రవారం ఆర్మూర్ నియోజక వర్గానికి వస్తున్న జీవన్ రెడ్డికి భారీ ఎత్తున స్వాగతం చెప్పడానికి సన్నహాలు చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం మామిడిపల్లి చౌరస్తా వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. వందలాది వాహణాలతో ర్యాలీ తీసి ఎన్నికల ప్రచారంకు శ్రీకారం చుట్టడానికి యత్నిస్తున్నాడు జీవన్ రెడ్డి. ఈ ర్యాలీ – బహిరంగ సభలో ప్రసంగించడానికి ఎమ్మెల్సీ కవితను ముక్యఅతిథిగా ఆహ్వనిస్తున్నారు.
పెర్కిట్ నుంచి ప్రారంభమయ్యే ర్యాలీలో పాల్గొనే వేలాది మందికి అంకాపూర్ లో విందు బోజనం ఏర్పాటు చేస్తున్నారు. అయితే… బీజేపీ అభ్యర్థి రాకేష్ రెడ్డి స్వంత ఊరు అంకాపూర్ కావడంతో జీవన్ రెడ్డి అక్కడే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.