నిజామాబాద్ జిల్లాలో అన్నీ ఆమెనే..
అందరూ డమ్మినే..
నియోజక వర్గానికి పరిమితమైన మంత్రి.. జిల్లా అధ్యక్షులు
కల్వకుంట్ల కవిత.. నిజామాబాద్ జిల్లాలో ఆమె చెప్పింది వేదం.. ఆమె గీసింది శాసనం.. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె ఆశీర్వాదం లేకుండా ఏ పదవి దరిజేరదు. అయినా.. ఆమె పదవి చిన్నదే.. కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ మాత్రమే..
కానీ.. ఆ పదవి నామ మాత్రమే.. అంతకంటే పెద్ద హోదా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ముద్దుల కూతురు. ఆ పేరుతోనే అధికారంను తమకు అనుకూలంగా మలుచుకుంది. కనుసైగలతో ఆమె జిల్లా రాజకీయాలను శాసిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో అన్నీ ఆమెనే.. అందరూ డమ్మినే అని పొలిటికల్ టాక్..
మంత్రి ప్రశాంత్ రెడ్డి కావచ్చు.. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి కావచ్చు.. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు.. ఎమ్మెల్యేలు కావచ్చు.. స్టేట్ లెవల్ లో నామినేటెడ్ చైర్మన్ పదవులలో ఉన్న పొలిటికల్ లీడరులు కావచ్చు.. ఎవరైనా ఆమెకు దండం పెట్టాల్సిందే. ఆమె ఆశీర్వాదం కోసం గంటల తరబడి నిరిక్షించాల్సిందే.
నియోజక వర్గ సరిహద్దులు దాటలేరు..
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లాలో ఎక్కడైనా వెళ్లోచ్చు.. పొలిటికల్ లేదా అధికార పార్టీ సభలలో పాల్గొనచ్చు.. ఆమె మా నియోజక వర్గానికి రావడం ఎమ్మెల్యేలు అదృష్టంగా భావిస్తారు.. కానీ.. స్టేట్ లెవల్ లో పదవులున్న వారు మాత్రం నిజామాబాద్ జిల్లాలోని తొమ్మిది నియోజక వర్గాలలో ఎక్కడ కనిపించరు. నియోజక వర్గాల సరిహద్దులు దాటి బయటకు అడుగులు వేయలేరు.
బాల్కొండ నియోజక వర్గంకు మంత్రి
రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజక వర్గంకు మాత్రమే పరిమితమయ్యారు. సీఎం కేసీఆర్ దత్తపుత్రుడిగా పేరు ఉన్నా.. జిల్లా నుంచి ఉన్న ఏకైక మంత్రి అయినా ఎవరు కూడా తమ నియోజక వర్గంలో జరిగే అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొనాలని ఆహ్మనించక పోవడం చర్చానీయంశంగా మారుతుంది.
ఆర్మూర్ నియోజక వర్గంకు బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు
నిజామాబాద్ బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆర్మూర్ నియోజక వర్గానికి పరిమితమయ్యాడు. బీఆర్ ఎస్ అధిష్టాన వర్గం ఆదేశాలతో అప్పుడప్పుడు జిల్లా కేంద్రంలో ప్రోగ్రాంలు చేస్తాడు. సీఎం కేసీఆర్ తో దత్తపుత్రుడిగా పేరున్న జీవన్ రెడ్డి కూడా మహారాష్ట్ర రాజకీయాలలో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ప్రతి పక్షాలను నోటితో ఆడుకునే జీవన్ రెడ్డిని మహారాష్ట్ర రాజకీయాలలో యాక్టివ్ గా చేయాలని కూడా అధిష్టానవర్గం ఆలోచిస్తుందనేది టాక్ వినిపిస్తోంది.
అన్నీ తానై భుజన వేసుకుంటున్న కవిత
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలలో ఓడి పోవడం కల్వకుంట్ల కవిత జీర్ణించుకోలేని ఆంశం. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి గౌడ్ ఓడి పోతానని ముందుగానే చేతులు ఎత్తి వేయడంతో బీజేపీ అభ్యర్థి అరవింద్ గెలుపుకు కలిసోచ్చింది. అయితే.. కల్వకుంట్ల కవిత ఓడి పోవడానికి జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు తెరవెనుక ఉన్నారనే విషయం ఆమె అర్థం చేసుకుంది. కవిత ఎంపీగా గెలిస్తే తాము డమ్మి అవుతామనే భావనతో ఆమెను ఓడించడానికి యత్రించారనేది టాక్. అయితే.. ఓడిన దగ్గరనే గెలువాలనే లక్ష్యంతో కవిత పావులు కదుపుతుంది. నిజామాబాద్ పార్లమెంట్ నియోజక వర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పార్టీని పటిష్టం చేస్తోంది.
- యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్