బండి సంజయ్ వర్సెస్  సీపీ రంగనాథ్ వార్

10వ తరగతి పేపర్ లీకేజ్ కేసు..

బండి సంజయ్ వర్సెస్  సీపీ రంగనాథ్ వార్

హైదరాబాద్, ఏప్రిల్ 11 (వైడ్ న్యూస్) ప్రజలకు న్యాయం చేయడానికి విధులు నిర్వహించే తాను ఎప్పుడు సెటిల్ మెంట్లు చేయలేదన్నారు వరంగల్ సీపీ రంగనాథ్. నేను సెటిల్మెంట్లు చేశానాని బండి సంజయ్‌ చేసిన ఆరోపణలను వరంగల్ సీపీ రంగనాథ్ ఖండించారు.

తనపై ఆరోపణలు చేసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు వరంగల్ సీపీ రంగనాథ్ సవాల్ విసిరారు. తాను సెటిల్మెంట్లు చేసినట్లు నిరూపించాలని సీపీ ఛాలెంజ్ విసిరారు. తనపై బండి సంజయ్ అనేక ఆరోపణలు చేశారని.. కానీ తాను ఎవరి పక్షాన వుంటానో ప్రజలకు తెలుసునని రంగనాథ్ అన్నారు. బండి సంజయ్ పోలీసులపై ఆరోపణలు చేస్తుంటారని.. కొన్ని కేసుల్లో కఠిన చర్యలు తీసుకోవడం వల్ల కొందరికి బాధ కలగొచ్చని ఆయన పేర్కొన్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!