మాజీ ప్రధాని పివి ఇంట్లో చండీ యాగం
వరంగల్,మార్చి 27 : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వంగర గ్రామంలో .వైభవంగా మహా చండీ యాగాన్ని పివి వంశీయులు శనివారం నిర్వహించారుఏ.
యాగంలో పివి తనయుడు, వారి వంశీయులు పివి ప్రభాకర్ రావు సతీమణి ఉ మాదేవి, ఎమ్మెల్సీ వాణిదేవి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రావణ్ కుమార్, డాక్టర్ సరస్వతి, ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రభాకర్ రావు వేరువేరుగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
వేద పురోహితుల ఆధ్వర్యంలో తెల్లవారు జాము నుంచే మంగళ వాయిద్యాలతో సుప్రభాత సేవ, గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రసన్న, అఖండ దీపారాధన, కంకణ ధారణ, నవగ్రహ మండపరాధన, ప్రధాన కలశ స్థాపన పూజలు నిర్వహించారు. తదుపరి మహాగణపతి హోమం, నవగ్రహ అష్టదిక్పాలక దేవత హెూమాలు, రుద్ర హెూమం, మహా సుదర్శన హెూమం, భైరవ హెూమం, మహా చండీయాగం నిర్వహించారు. పివి వంశీయుల ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా పీవీ వంశీయులు మాట్లాడుతూ మా కుటుంబ సభ్యులు సాధించిన విజయాలన్నీ దైవానుగ్రహం దేశ ప్రజలు చూపుతున్న ప్రేమ, ఆప్యాయత వల్లే సాధ్యమయ్యాయని బలంగా నమ్ముతున్నామన్నారు. ఈ హెూమానికి జెన్కో సీఎండి ప్రభాకర్ రావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్, వాణిజ్య, ఫైనాన్స్ జైన్ కో డైరెక్టర్ టిఆర్ కెరావు, పిఎజెఎఫ్ అధ్యక్షుడు జితేందర్ రావు తదితరులు పాల్గొన్నారు