డీజీపీ రేసులో 8 మంది
నిర్దేశం, హైదరాబాద్ః
తెలంగాణ డీజీపీ డా. జితేందర్ మరికొన్ని నెలల్లో రిటైర్ అవనున్నారు. ఈ నేపథ్యం కొత్త పోలీస్ బాస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. డీజీపీ రేసులో ఎనిమిది మంది సీనియర్ ఐపీఎస్‌లు ఉన్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఎనిమిది మంది పేర్లను సర్కార్ పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం అర్హతల ఆధారంగా జాబితా నుంచి ముగ్గురి పేర్లును సూచిస్తూ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి యూపీఎస్సీ పంపించనుంది. ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న డా.జితేందర్ ఈ ఏడాది సెప్టెంబర్ 6న పదవీ విరమణ చేయనున్నారు.
ఈ క్రమంలో ఎనిమిది మంది సీనీయర్ ఐపీఎస్‌ల పేర్లను యూపీఎస్సీకి సర్కార్ పంపించింది. రవి గుప్తా, సీవీ ఆనంద్, డా. జితేందర్ , ఆప్టే వినాయక్ ప్రభాకర్, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. బి. శివధర్ రెడ్డి డా. సౌమ్య మిశ్రా శిఖా గోయల్ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. వీరిలో తెలంగాణ పోలీస్ శాఖ కొత్త బాస్ ఎవరో మరికొద్దురోజుల్లో తెలియనుంది. ఈ ఎనిమిది మంది ఐపీఎస్ ఆఫీసర్లతో అర్హతల ఆధారంగా ముగ్గురి పేర్లను సూచిస్తూ సర్కార్‌కు తిరిగి పంపించనుంది యూపీఎస్సీ. వారిలో ఒకరిని ప్రభుత్వం డీజీపీగా నియమించనుంది.