పాకిస్తాన్ లో మరీ దారుణం.. ఐడీలు చూసి మరీ 50 పంజాబీలను చంపారు

నిర్దేశం, ఇస్లామాబాద్: పాకిస్తాన్‌ లోని బలూచిస్తాన్‌లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ముసాఖెల్ జిల్లాలో కొంతమంది సాయుధ వ్యక్తులు రోడ్డుమీద వెళ్తోన్న ట్రక్కులు, బస్సులను ఆపి ప్రయాణికులను దింపారు. తర్వాత వారిని ఒకొక్కరిని పరిశీలించి ఆపై కొంత మంది మీద కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో కనీసం 50 మంది మరణించారు. పంజాబ్ ప్రజలను లక్ష్యంగా చేసుకుని ముసాఖేల్ సాయుధులు దాడి చేశారని పాకిస్తాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి అజ్మా బుఖారీ తెలిపారు.

10 వాహనాలకు నిప్పు
ముసాఖేల్ జిల్లాలోని రారాషిమ్ ప్రాంతంలో నిషేధిత గ్రూపుకు చెందిన ఉగ్రవాదులు హైవేను అడ్డుకుని మరీ ఈ దారుణానికి తెగబడ్డారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయూబ్ ఖోసో తెలిపారు. అయితే ఆ సంస్థ పేరును మాత్రం ఆయన వెల్లడించలేదు. సాయుధులు బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తులపై కాల్పులు జరపడమే కాకుండా 10 వాహనాలకు నిప్పుపెట్టారని ముసాఖేల్ అసిస్టెంట్ కమిషనర్ నజీబ్ కాకర్ తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.

పంజాబీలే లక్ష్యం
దాదాపు నాలుగు నెలల క్రితం కూడా ఇలాంటి దాడి జరిగింది. అంతకుముందు ఏప్రిల్‌లో నోష్కీ సమీపంలో తొమ్మిది మంది ప్రయాణికులను బస్సులో నుంచి దింపి, వారి ఐడి కార్డులను తనిఖీ చేసి కాల్చి చంపారు. గతేడాది అక్టోబర్‌లో బలూచిస్తాన్‌లోని కెచ్ జిల్లాలో పంజాబ్‌కు చెందిన ఆరుగురు కూలీలు హత్యకు గురయ్యారు. 2015 సంవత్సరంలో సాయుధ వ్యక్తులు 20 మంది కార్మికులను హత్య చేశారు. ఈ హత్యలన్నీ పంజాబ్‌ ప్రాంత వాసులే లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడులు హత్యలు వారి జాతి నేపథ్యం కారణంగా జరుగుతున్నట్లు తెలుస్తోందని అంటున్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!