ఎకరం 50 కోట్లు.. అమ్మకానికి 500 ఎకరాలు

ఎకరం 50 కోట్లు
అమ్మకానికి 500 ఎకరాలు

హైదరాబాద్, నిర్దేశం:
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో 400 ఎకరాల సర్కార్ భూమిని వేలం వేయాలని భావిస్తోంది. శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి గ్రామం పరిధిలో ఈ భూమి ఉండగా.. టీజీఐఐసీకి ద్వారా విక్రయించేందుకు ప్రయత్నిస్తుంది. సంక్షేమ పథకాల అమలు, ఇతర ఇవసరాల కోసం డబ్బు సమీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అంతర్జాతీయ స్థాయి లేఔట్‌ను అభివృద్ది చేసి.. వేలం ద్వారా భూములను విక్రయింంచేందుకు కన్సల్టెంట్‌ నియామకానికి  టెండర్లు పిలిచింది. ఈ నెల 15 వరకు బిడ్ల దాఖలుకు గడువిచ్చారు.

డిసెంబర్ 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే మొదటి భూ వేలం ఇదే కానుంది. ఈ వేలం ద్వారా ప్రభుత్వం రూ. 20,000 కోట్లకు పైగా సేకరించాలని భావిస్తోంది. కంచ గచ్చిబౌలి గ్రామంలోని సర్వే నంబర్ 25(P) వద్ద ఉన్న 400 ఎకరాల స్థలంలో ‘మాస్టర్ ప్లాన్ లేఅవుట్’ను అభివృద్ధి చేయాలని TGIIC యోచిస్తోంది. ఈ భూమిని అభివృద్ధి చేసి దశలవారీగా విక్రయించనున్నారు. అత్యంత ఖరీదైన వెస్ట్‌ జోన్‌ పరిధిలో, ఐటీ కంపెనీలకు అతి సమీపంలోని ఈ భూమి ఉంది. హైటెక్ సిటీ నుంచి 7-8 కి.మీ, పంజాగుట్ట క్రాస్‌రోడ్స్ నుండి 15-18 కి.మీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 22 కి.మీ, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి దాదాపు 33 కి.మీ దూరంలో ఈ స్థలం ఉంది. అక్కడి లేఔట్లలో గజానికి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు పలికే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఎకరాల్లో అయితే ఎకరం రూ. 50 కోట్లు పలుకుతుందని అంచనా.లేఔట్‌ మాస్టర్‌ ప్లాన్‌ తయారీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వేలం ద్వారా ప్లాట్ల విక్రయాలు తదితర కార్యక్రమాల నిర్వహణ కోసం తాజాగా.. రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ని ఆహ్వానించారు. క్వాలిటీ కమ్‌ కాస్ట్‌ బేస్డ్‌ సెలక్షన్‌ (క్యూసీబీఎస్‌) పద్ధతిలో బిడ్డర్‌ను ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, భూమలు వేలం ద్వారా వచ్చే రూ.20 వేల కోట్లను రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సహా ఇతర పథకాల కోసం వెచ్చించనున్నట్లు తెలిసింది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »