విదేశీ టీవీ సీరియల్స్ చూసినందుకు 30 మంది చిన్నారులకు మరణశిక్ష?

నిర్దేశం: ఉత్తర కొరియాలో కిమ్ జాంగ్ ఉన్ నియంతృత్వం ఎవరికీ తెలియనిది కాదు. దుర్మార్గమైన అతడి పాలన ఎప్పుడూ వార్తల్లో ఉంటుంద. ఉత్తరకొరియాలో జుట్టు కత్తిరించుకోవడం నుంచి తినడం, తాగడం, టీవీ చూడటం వరకు నియంత ఆదేశాలు సాగుతుంటాయి. చిన్న దొంగతనం చేసినా మరణశిక్ష పడుతుంది. అయితే ఇప్పటి వరకు వినని ఓ దుర్మార్గం బయట చక్కర్లు కొడుతోంది. విదేశీ టీవీ సీరియల్స్ చూసినందుకు 30 మంది చిన్నారులకు మరణశిక్ష విధించాడన్న వాదనలు వినిపిస్తున్నాయి.

2024 సంవత్సరం ప్రారంభంలో దక్షిణ కొరియాను తన ప్రధాన శత్రువుగా కిమ్ జోంగ్ ప్రకటించాడు. దక్షిణ కొరియా పాటలు వినడం, సినిమాలు చూడటం నేరం. దక్షిణ కొరియా టీవీ డ్రామాలు ఉత్తర కొరియాలో ప్రసారం చేయరు. అయితే కొంతమంది స్మగ్లర్లు వాటిని పెన్ డ్రైవ్‌లలో తీసుకువచ్చి ఉత్తర కొరియా పిల్లలకు ఖరీదైన ధరలకు విక్రయిస్తున్నారు. ఎందుకంటే ఉత్తర కొరియా పిల్లలు ఈ డ్రామాలు, సీరియల్స్ చూడటానికి ఇష్టపడతారు. అందులో భాగంగానే కొంత మంది పిల్లలు దక్షిణ కొరియా టీవీ సీరియల్స్ చూస్తున్న విషయం నియంత ప్రభుత్వానికి తెలిసిపోయిందని అంటున్నారు.

దక్షిణ కొరియా నివేదిక వెల్లడించింది
దక్షిణ కొరియాకు చెందిన చోసున్ టవీ, కొరియా జూంగ్ ఆంగ్ అనే మీడియా సంస్థలు తాజా విషయాన్ని వెల్లడించాయి. దక్షిణ కొరియా కే-డ్రామాలను వీక్షించినందుకు ఉత్తర కొరియా 30 మంది స్కూల్ విద్యార్థులను చంపిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వాదనలపై దక్షిణ కొరియా అధికారులు ఎలాంటి కామెంట్ చేయలేదు. దక్షిణ కొరియా అధికారి జోంగాంగ్ డైలీ మాట్లాడుతూ ‘‘ఉత్తర కొరియాలో ఏమి జరుగుతుందో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఈ నివేదిక అందకు మరో సాక్ష్యం’’ అని అన్నారు.

ఉత్తర కొరియాలో విదేశీ చిత్రాలను చూడడానికి నియమాలు ఏమిటి?
బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం.. దక్షిణ కొరియా, అమెరికా, జపాన్ సంస్కృతిని తమ దేశంలోని పౌరులు స్వీకరించకూడదని ఉత్తర కొరియాలో ఒక చట్టం ఉంది. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. దక్షిణ కొరియా పాటను విన్నందుకు ఉత్తర కొరియాలో ఒక వ్యక్తికి ఇప్పటికే మరణశిక్ష విధించారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి 2022 నివేదికలో వెల్లడించారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!