గోవాలో జీ20 పర్యాటక శాఖ మంత్రుల సమావేశాలు

 గోవాలో  జూన్ 19 నుం చి 22 వరకు

జీ20 పర్యాటక శాఖ మంత్రుల సమావేశాలు

హైదరాబాద్, జూన్ 12 :  జూన్ 19 నుం చి 22 వరకు గోవాలో జీ20 పర్యాటక శాఖ మంత్రుల సమావేశం జరగనుంది. పర్యాటక శాఖకు సంబంధించిన తొలి వర్కింగ్ గ్రూప్ సమావేశం గుజరాత్‌లోని రణ్ ఆఫ్ కచ్‌లో, రెండోది పశ్చిమబెంగాల్‌లోని సిలిగురిలో, మూడోది ఇటీవలే శ్రీనగర్‌లో జరిగింది. పాకిస్థాన్ మరికొన్ని దేశాలు శ్రీనగర్ లో జీ20 టూరిజం మీటింగ్ చేయడానికి అభ్యంతరం వ్యక్తం చేశాయి. పాకిస్థాన్ మిలటరీ సవాళ్లు విసిరింది. వాళ్లు ఇతర దేశాలకు ఉత్తరాలు రాసి తప్పుడు ప్రచారం చేశారు. భారతదేశం వెళ్లినా జమ్ముకశ్మీర్ వెళ్లకూడదని కొన్ని దేశాలు అడ్వైజరీస్ ఉన్నాయి. అయినా ప్రతినిధులు మోదీ ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో శ్రీనగర్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. అద్భుతంగా సమావేశాలు జరిగాయి. శాంతియుతంగా, సంతోషకరంగా సమావేశాలు జరిగాయి. పాకిస్థాన్ తలదించుకునేలా సమావేశాలు నిర్వహించాం.

గతంలో జరిగిన మూడు సమావేశాల్లోనూ కరోనానంతరం పర్యా టకాన్ని మళ్లీ పట్టాలు ఎక్కించడంతో. పాటుగా.. ప్రపంచ పర్యాటకాభివృద్ధికి పరస్పర సహకారం , పొటెన్షియల్ ఉన్నదేశాలకు సంపూర్ణ
సహకారం తదితర అంశాలపై ఆసక్తికరమైన చర్చజరిగింది.

ఫైనల్ మీటింగ్ గోవాలో జరగనుంది. గోవా రోడ్ మ్యాప్ పేరుతో టూరిజంకు సంబధించి ఒక డిక్లరేషన్ ఈ సమావేశంలో తీసుకురానున్నాం. గోవా రోడ్ మ్యాప్ టూరిజం తీర్మానంపై సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.

ఈ సమావేశాల్లో భారతదేశం కేం ద్రంగా క్రూయిట్ టూరిజం అభివృ ద్ధి, ప్రపంచ పర్యాటకాభివృద్ధిలో ప్రభుత్వ ,ప్రయివేటు భాగస్వామ్యం అనే అంశంపై మంత్రులు తమ అభిప్రాయాలు తెలియజేస్తారు. ఈ సమావేశాల సం దర్భంగా గోవా, భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!