కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల ఎస్‌బీఐ ATMలో దొంగలు డబ్బు చోరీ చేసి తీసుకెళ్తుండగా సినీ ఫక్కీలో పోలీసులు అడ్డుకున్నారు.
కోరుట్ల-వేములవాడ రోడ్డులోని ATM నుంచి నగదు కాజేసి కారులో పారిపోయేందుకు ప్రయత్నించారు.
ఈక్రమంలో చోరీకి సంబంధించిన విషయం హైదరాబాద్‌లోని బ్యాంక్ ప్రధాన కార్యాలయానికి సిగ్నల్ వెళ్లడంతో.. అధికారులు వెంటనే కోరుట్ల పోలీసులను అప్రమత్తం చేశారు. తక్షణమే స్పందించిన పోలీసులు దుండగులను పట్టుకునేందుకు.. వారి కారును పోలీసు వాహనంతో ఢీకొట్టారు.
దీంతో బ్యాగ్‌లోని ₹19లక్షల విలువైన నోట్లు రోడ్డుపై పడ్డాయి.
దుండగులు డబ్బును వదిలేసి పరారయ్యారు.