ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు పదవతరగతి పరీక్షలు

పదవతరగతి పరీక్షల షెడ్యూల్

ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు

హైదరాబాద్ మార్చి,25 :: రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. కాంపోజిట్ కోర్సు మరియు సైన్స్ పేపర్ల వ్యవధి ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.50 వరకు 2652 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. 4,85,826 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉన్నారు.

11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 24 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు హాల్‌టికెట్లు అందచేశారు. కార్యాలయ వెబ్‌సైట్ www.bse.telangana.gov.in లో కూడా అందుబాటులో ఉంటాయి. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది. డీఈవోలు పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతుల పరిశీలన పూర్తి చేశారు. పరీక్షా సిబ్బంది, ఫ్లయింగ్ స్క్వాడ్‌ల నియామకం, స్టోరేజీ పాయింట్లకు రహస్య సామగ్రి పంపిణీ మరియు అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పరీక్ష విధులకు నియమించిన సిబ్బందిందరికీ గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యింది.

ఆరోగ్య శాఖ ప్రతి పరీక్షా కేంద్రంలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు మరియు ప్రథమ చికిత్స కిట్‌లతో పాటు పరీక్షలు జరిగే అన్ని రోజులలో ఒక ఏఎన్‌ఎంను డిప్యూట్ చేస్తుంది. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి వీలుగా TSRTC సమయానికి ఎక్కువ సంఖ్యలో బస్సులను నడుపుతుంది. ప్రిపరేషన్ రోజులలో మరియు పరీక్షా కాలంలో విద్యుత్ శాఖ నిరంతర విద్యుత్ సరఫరాను అందించనుంది.

జిల్లా కలెక్టర్లు, డీఈవోలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తుతో పాటు రహస్య సామగ్రిని తరలించేందుకు వాహనాలకు ఎస్కార్ట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!